ETV Bharat / bharat

కరోనా రోగుల్లో ఇన్ఫెక్షన్- 15 రోజుల్లో 13 కేసులు - covid patients delhi fungal infections

దిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అరుదైన ఇన్ఫెక్షన్​ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లోనే ఈ వ్యాధి తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇన్ఫెక్షన్ మరణాల రేటు 50 శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇతర జబ్బులు ఉన్నవారి పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోందని అన్నారు.

Deadly fungal infection found in recovered COVID patients in Delhi
కరోనా రోగుల్లో ఇన్ఫెక్షన్- 15 రోజుల్లో 13 కేసులు
author img

By

Published : Dec 17, 2020, 5:26 AM IST

కరోనా నుంచి కోలుకున్నవారిలో పలువురికి అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తాయి. దిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో పదిహేను రోజుల్లో 13 కేసులు నమోదయ్యాయి. 'ముకొర్మైకోసిస్' అనే బ్లాక్ ఫంగస్​ను వీరిలో గుర్తించినట్లు వైద్య నిపుణులు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా సగం మంది రోగులు ప్రాణాలు కోల్పోతారని, మిగిలినవారు చూపు, దవడ కోల్పోయే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ ఫంగస్ ప్రధానంగా మొక్కలు, జంతువులతో పాటు గాలిలోనూ ఉంటుందని సీనియర్ ఈఎన్​టీ సర్జన్ డా. మనీష్ ముంజల్ తెలిపారు. కొవిడ్ అనంతరం తలెత్తె ఫంగల్ ఇన్ఫెక్షన్లపై ఆయన పరిశోధన చేస్తున్నారు. స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఈ ఫంగస్ కరోనా రోగులపై దాడి చేస్తోందని చెప్పారు. ఇతర జబ్బులు ఉన్నవారి పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోందని అన్నారు.

Deadly fungal infection found in recovered COVID patients in Delhi
పూర్తిగా ఒక కన్ను కోల్పోయిన బాధితుడు

"ఈ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల కంటి చూపు పోతుంది. 15 రోజుల్లో ఇలాంటివి 13 కేసులు గంగారాం ఆస్పత్రిలో వెలుగుచూశాయి. ఇన్ఫెక్షన్ వల్ల రోగుల ముక్కు, దవడ ఎముకను తీసేయాల్సి వచ్చింది. ఈ వ్యాధి మరణాల రేటు 50 శాతం. ఇన్ఫెక్షన్ కంటికి గానీ, మెదడుకు గానీ చేరుకుంటే రోగి ప్రాణాలు కోల్పోతాడు. చాలా మంది రోగులు తమకు ఊపిరి ఆడటం లేదని చెబుతున్నారు. బలహీనత, అలసట లక్షణాలు ఉన్నాయి. ఇంతకుముందెప్పుడూ ఇలాంటి ఇన్ఫెక్షన్ ఇంత ప్రమాదకరంగా మారలేదు. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా కనిపిస్తోంది."

-డా. మనీష్ ముంజల్, ఈఎన్​టీ నిపుణులు

పశ్చిమ దిల్లీకి చెందిన 32 ఏళ్ల వ్యాపారి రాజేష్​కు ఇలాంటి ఇన్ఫెక్షన్ తలెత్తింది. తొలుత కరోనా బారిన పడ్డ ఆయన.. నాలుగు రోజుల పాటు జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం వల్ల ఆస్పత్రిలో చేరారు. యాంటీవైరల్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ ఇతర ఔషధాలు ఇచ్చిన తర్వాత కోలుకున్నారు. ఏడు రోజుల తర్వాత డిశ్ఛార్జి అయ్యారు.

ఇన్ఫెక్షన్ బారిన పడిన రోగి

ఆ తర్వాత ఆయన ముక్కు ఎడమవైపు భాగంలో సమస్య తలెత్తింది. కన్ను వాచిపోయింది. ఆస్పత్రికి మళ్లీ వచ్చిన ఆయనకు యాంటీబాడీలు, నొప్పి నిరోధక మాత్రలు ఇచ్చారు. ఇవేవీ పనిచేయలేదు. క్రమంగా రాజేష్ చూపు పోయింది. ఎడమవైపు ముఖం పూర్తిగా మొద్దుబారిపోయింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ముకోర్మైకోసిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది.

ఇన్ఫెక్షన్ సంబంధిత దృశ్యాలు

ఇలా సర్ గంగారాం ఆస్పత్రిలో 13 కేసులు నమోదయ్యాయి. వీరందరూ కరోనా బాధితులే కావడం ఆందోళన కలిగిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.