భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా నియమితులైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న సురవరం సుధాకర్ రెడ్డి ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజీనామా చేశారు.
సీపీఐ జాతీయ సమితి సమావేశంలో రాజా నియామకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజా పేరును పార్టీ సిఫార్సు చేయగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
2019 లోక్సభ ఎన్నికల్లో సీపీఐ ఘోర పరాభవం చవి చూసింది. దేశవ్యాప్తంగా రెండు ఎంపీ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ కారణంగానే పార్టీ నాయకత్వంలో మార్పులు చేస్తున్నారు.
డి.రాజా తమిళనాడు నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సీపీఐ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి 2012లో బాధ్యతలు స్వీకరించారు. వరుగా మూడు సార్లు సారథ్య పగ్గాలు చేపట్టారు. పదవీ కాలానికి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా స్వయంగా తప్పుకున్నారు.
ఇదీ చూడండి: దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత