ETV Bharat / bharat

రెండు రోజుల్లో దేశానికి మరో తుపాను ముప్పు..!

author img

By

Published : Jun 1, 2020, 6:06 PM IST

భారత్​కు మరో తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే ఈ తుపాను విరుచుకు పడనునన్నట్లు అంచనా వేశారు శాస్త్రవేత్తలు.

Cyclone 'Nisarga' to cross Maha, Gujarat coasts in 2 days
భారత్​కు 'నిసర్గ' రూపంలో మరో తుపాను ముప్పు.!

భారత్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ పరిశోధనాశాఖ తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఇటీవల అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు. ఈ అల్పపీడనం గోవాలోని పాంజిమ్‌కు నైరుతి దిశగా 370 కి.మీ, ముంబయికి దక్షణ నైరుతి దిశగా 690 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షణ నైరుతి దిశలో 920 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు పేర్కొంది వాతావరణ శాఖ. ఇది తొలుత వాయు గుండంగా.. అనంతరం తుపానుగా మారే అవకాశమున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు.

'నిసర్గ'గా వస్తోంది..

'నిసర్గ'గా పిలుస్తోన్న ఈ తుపాను ఈ నెల 3వ తేదీ సాయంత్రానికి దక్షిణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర తీరాలను తాకవచ్చని వారు తెలిపారు. సూపర్‌ సైక్లోన్‌ అంపన్‌ కొద్ది రోజుల క్రితమే పశ్చిమ​బంగాల్​, ఒడిశాలలో విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో.. మరో తుపాను హెచ్చరిక వెలువడటం ప్రజలను తీవ్ర భయాలకు గురిచేస్తోంది.

'నిసర్గ' ప్రభావంతో గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్రల్లో జూన్‌ 2 నాటికి 105 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించారు. ఇక జూన్‌ 3 సాయంత్రం 5:30 గంటలకు గాలివేగం మరింత ఉద్ధృతమై 125 కి.మీ. వరకూ చేరవచ్చని అధికారులు తెలిపారు. జూన్‌ 3, 4 తేదీల్లో ఆ రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం జూన్‌ 4న తుపాను బలహీనపడవచ్చని వాతావరణ పరిశోధనా కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చదవండి: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.