'బుల్బుల్' తుపాను ఆదివారం పశ్చిమ బంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌లను కుదిపేసింది. తుపాను ధాటికి బంగాల్లో పదిమంది మృతిచెందగా.. ఒడిశాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్‌లోనూ తుపాను బీభత్సానికి పది మంది బలయ్యారు. భారీ వర్షాలతో పాటు విపరీతంగా గాలులు వీస్తుండటం వల్ల కోల్‌కతా నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. గంటకు 135 కి.మీ వేగంతో వీస్తున్న భీకర గాలుల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. పశ్చిమ బంగాల్లోని తీర ప్రాంతంలో భారీగా నష్టం వాటిల్లింది. 2.73 లక్షల కుటుంబాలు తుపాను తాకిడికి గురికాగా.. 2,473 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఒడిశాలో ఇద్దరు మృతి
భారీ వర్షాలకు ఒడిశాలోని తీర ప్రాంతాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. భారీ ఈదురు గాలుల కారణంగా ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావానికి తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. భద్రక్ జిల్లాలో సహాయక చర్యల కోసం వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలో పరిస్థితిని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 20 ఒడిశా విపత్తు నిర్వహణ బృందాలు సహా 226 అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.
ఒడిశాలోని ఐదు జిల్లాల్లో దాదాపు 6 లక్షల హెక్టార్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. 5,500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు. వారం రోజుల్లో నష్టాన్ని పూర్తిగా అంచనా వేయనున్నట్లు తెలిపారు.
బంగ్లాదేశ్‌లోనూ బీభత్సం
తుపాను కారణంగా బంగ్లాదేశ్‌లోనూ భారీ నష్టం వాటిల్లింది. 10 మంది మరణించారు. వందల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా అధికారులు 21 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇదీ చూడండి: 'బుల్బుల్' తుపాను బీభత్సం- బంగాల్లో 10 మంది బలి