ETV Bharat / bharat

నేడు సీడబ్ల్యూసీ భేటీ.. పార్టీ అధ్యక్ష ఎన్నికే అజెండా! - కాంగ్రెస్​ అధ్యక్ష పదవి

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ సహా.. పార్టీ సంస్థాగత ఎన్నికల తేదీని నిర్ణయించనుంది. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది.

CWC meeting on Jan 22, likely to decide date of election for new party chief
నేడు సమావేశం కానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
author img

By

Published : Jan 22, 2021, 4:57 AM IST

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం దిల్లీలో జరగనుంది. పార్టీకి సబంధించి అత్యున్నత నిర్ణయాధికారం సీడబ్ల్యూసీ తీసుకుంటుంది.

బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో పార్టీ అనుసరించే వ్యూహాలపై చర్చించనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ప్రకటన వంటి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది.

క్రియాశీల అధ్యక్షుల కోసం..

పార్టీ అంతర్గత ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఒక లేఖ రాసింది. గత ఆగస్టులో 23మంది సీనియర్​ నాయకులు ఈ లేఖ రాశారు. బ్లాక్​ స్థాయి నుంచి పార్టీ అధ్యక్ష పదవి వరకు క్రియాశీలకంగా పూర్తి సమయం వెచ్చించే నాయకులను అంతర్గత ఎన్నికల ద్వారా నియమించాలని వారు డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: నడ్డా ఎవరు?.. నేను జవాబుదారీ కాదు: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.