కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం మాజీ ముఖ్య కార్యదర్శి ఎం.శివశంకర్‌ను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. గత నెల 29న శివశంకర్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ఎర్నాకుళంలోని కక్కనాడ్ జైలుకు తరలించారు. అయితే ఆయనను కస్టమ్స్ పరిధిలోకి తీసుకునేందుకు కోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.
సీఎంఓ మాజీ ముఖ్యకార్యదర్శి అరెస్ట్ - gold smuggling news today
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎంఓ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని అరెస్టును నమోదు చేయడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
సీఎంఓ మాజీ ముఖ్యకార్యదర్శి అరెస్ట్