ETV Bharat / bharat

భారత్ చేరనున్న వీవీఐపీ విమానం 'బోయింగ్​ 777'

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన ప్రత్యేక బోయింగ్ 777 విమానం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్​ చేరనుంది. ఎయిర్​ ఇండియా వన్​గా పిలిచే ఈ విమానంలో అధునాతన భద్రతా పరికరాలను అమర్చారు. వీవీఐపీల కోసం వినియోగించే మరో బీ777 విమాన త్వరలోనేం భారత్​ చేరుతుందని అధికారులు తెలిపారు.

plane for VVIP travel
భారత్ చేరనున్న వీవీఐపీ విమానం 'బోయింగ్​ 777'
author img

By

Published : Oct 1, 2020, 2:15 PM IST

దేశంలోని ప్రముఖుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన ప్రత్యేక బోయింగ్ 777 విమానం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్​ చేరనుంది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తోన్నఈ విహంగం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించడం కోసం ఉపయోగించునున్నారని అధికారులు వెల్లడించారు.

సాంకేతిక కారణాలతో ఆలస్యం

ఈ ఏడాది ఆగస్టు తొలినాళ్లలోనే విమానం బోయింగ్​ సంస్థ నుంచి ఎయిర్ ఇండియాకు అప్పగించాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. విహంగాన్ని స్వీకరించేందుకు ఆగస్టు రెండోవారంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఓ సీనియర్​ అధికారి అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు.

దిల్లీ విమానాశ్రయానికి..

ఎయిర్​ ఇండియా-1 గా పిలిచే ఈ విమానం టెక్సాస్ నుంచి దిల్లీ విమానాశ్రయానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

త్వరలోనే మరో విమానం..

వీవీఐపీల కోసం కొనుగోలు చేస్తోన్న మరో బోయింగ్​ బీ777 విమానం కొద్ది రోజుల్లోనే భారత్​కు చేరుతుందని అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాలను ముందుగా ఈ ఏడాది జులైలోనే అందించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలు వాయిదా పడినట్లు చెప్పారు.

వాయుసేన పైలట్లకే

ప్రముఖుల ప్రయాణాల్లో ఈ రెండు బీ777 విమానాలను ఎయిర్​ ఇండియా పైలట్లు కాకుండా వాయుసేన పైలట్లు నడుపుతారని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు.. ఎయిర్​ ఇండియాకు చెందిన బీ747 విమానంలో ప్రయాణం చేస్తున్నారు. వీటిని ఎయిర్​ ఇండియా పైలట్లు ఆపరేట్​ చేస్తున్నారు. బీ777 విమానాలు అందుబాటులోకి వచ్చాక బీ747లను ఎయిర్​ ఇండియాలో కమర్షియల్​ ఆపరేషన్స్​ కోసం వినియోగించనున్నారు.

కొత్త విమానాలను 2018లో కొన్ని నెలల పాటు ఎయిర్​ ఇండియాలో వినియోగించారు. తర్వాత వీవీఐపీల ప్రయాణాల కోసం ఆధునిక భద్రత పరికరాలు బిగించేందుకు బోయింగ్​ సంస్థకు పంపించారు. ఇందులో క్షిపణి రక్షణ వ్యవస్థ (ఎల్​ఏఐఆర్​సీఎం, వ్యక్తిగత రక్షణ సూట్స్​ ఉన్నాయి.

ఇదీ చూడండి: మహమ్మారుల్లో కరోనాతోనే అత్యధిక మరణాలు: ఐరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.