ETV Bharat / bharat

ఇంట్లో హింసిస్తే.. ఫోన్లో న్యాయం దొరుకుతుంది!

ఇంటిని చక్కదిద్దే ఇల్లాలికి.. ఇంటి మనుషులే నరకం చూపిస్తే ఎవరికి చెప్పుకుంటుంది? తాను పడే వేదన ఎవరికి అర్థం అవుతుంది? అని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారు. కానీ, ఇకపై గృహహింసకు గురైతే.. మహిళలే ఫోన్లే వారికి సాయం చేస్తాయి. కేవలం ట్విట్టర్​లోని ఓ ఫీచర్​ వారికి న్యాయం చేస్తుంది. అదెలా అంటారా? అయితే ఈ కథనం చదివేయండి.

crime-against-women-in-twitter-for-domestic-violence
ఇంట్లో హింసిస్తే.. ఫోన్లో న్యాయం దొరుకుతుంది!
author img

By

Published : Jun 20, 2020, 3:41 PM IST

కరోనాను తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. కరోనా కట్టడి సంగతేమో కానీ.. ఈ లాక్‌డౌన్‌ మొదలయ్యాక భారత్​ సహా పలు దేశాల్లో గృహహింస బారిన పడుతున్న మహిళల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. భారత్​లో అయితే లాక్‌డౌన్‌ కాలంలో గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు రెండు రెట్లు అధికమయ్యాయని జాతీయ మహిళా కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం అఘాయిత్యాలకు గురవుతున్న మహిళల కోసం ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్‌ వేదికను కూడా ఏర్పాటుచేసింది. ఈ పరిస్థితుల్లో గృహహింస బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ మైగ్రో బ్లాగింగ్‌ సైట్‌ ‘ట్విట్టర్‌ ఇండియా’ కూడా తాజాగా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా గృహహింసకు సంబంధించి అవసరమైన సమాచారం, కొత్త అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేకంగా ‘సెర్చ్‌ ప్రాంప్ట్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

క్లిష్ట పరిస్థితుల్లో...

మహిళా చైతన్యానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి పనిచేస్తోంది ట్విట్టర్‌ ఇండియా. ఈ క్రమంలో గృహహింసకు సంబంధించి కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా సెర్చ్‌ ప్రాంప్ట్‌ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. #ThereIsHelp అనే హ్యాష్‌ ట్యాగ్‌తో కూడిన ఈ సెర్చ్‌ టూల్‌ ద్వారా క్లిష్ట పరిస్థితుల్లో నమ్మదగిన సమాచారాన్ని అందించి మహిళలకు సహకరిస్తుందని ఆ సంస్థ తెలిపింది. అదే విధంగా ఈ ఫీచర్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గృహహింసకు సంబంధించిన సమాచారం, కొత్త కీవర్డ్స్‌ను అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో సమాచారమిచ్చే ఈ సెర్చ్‌ ప్రాంప్ట్‌.. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంలతో పాటు మొబైల్‌.ట్విటర్‌.కామ్‌లో కూడా కనిపిస్తుంది.
ఈ ఫీచర్‌తో గృహహింసపై పోరాటం చేద్దాం!

crime-against-women-in-twitter-for-domestic-violence
ఇంట్లో హింసిస్తే.. ఫోన్లో న్యాయం దొరుకుతుంది!

లాక్‌డౌన్‌ కాలంలో గృహహింసకు గురైనా ఫిర్యాదు చేసేందుకు చాలామంది మహిళలు సంకోచించారు. సామాజిక దూరం నేపథ్యంలో ఇతరులతో కూడా తమ సమస్యను చెప్పుకోలేకపోయారు. ఈ క్రమంలో ఈ సమస్యను అధిగమించడానికి కెనడాకు చెందిన ‘కెనడియన్‌ వుమెన్స్‌ ఫౌండేషన్‌’ అనే ఓ సంస్థ ఓ వినూత్న విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా గృహ హింస బాధితులు ఓ హ్యాండ్‌ సిగ్నల్‌ ఇవ్వడం ద్వారా ఫిర్యాదు చేసే విధానం అందరినీ ఆలోజింపచేసింది. ఈక్రమంలో తాజా సెర్చ్‌ టూల్‌తో మహిళలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ట్విట్టర్ ఇండియా ఉన్నతాధికారి మహిమా కౌల్‌ వెల్లడించారు.

‘ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల గృహహింస మీద పోరాటం చేయవచ్చని మేం గుర్తించాం. హింసకు వ్యతిరేకంగా క్లిష్ట పరిస్థితుల్లో సహాయాన్ని కోరే వారికి ఈ సెర్చ్‌ ప్రాంప్ట్‌ ద్వారా మేం అందించే సమాచారం ఎంతో దోహదం చేస్తుంది. ఉదాహరణకు #Crimeagainstwomen, #domesticviolence, #dowry, #dowrydeath, #gender violence .. గృహహింసతో సంబంధం ఉన్న కీ వర్డ్స్‌తో వెతకగానే ఈ సెర్చ్‌ ప్రాంప్ట్‌ మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది’ అని వివరించారు కౌల్.

ఇదీ చదవండి:అనుకోకుండా వచ్చి ఇలా గొంతు కలిపేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.