ETV Bharat / bharat

కరోనా టీకా వేసేందుకు సిరంజీలు సిద్ధమా? - All India Syringe & Needle Manufacturers Association

కరోనా వ్యాక్సిన్​ వేయడానికి కావాల్సిన మోతాదులో సిరంజీలు, సూదులు ఉత్పత్తి చేసే సామర్థ్యం తమకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది అఖిల భారత సిరంజీ, సూదుల ఉత్పత్తి సంఘం​(ఏఐఎస్​ఎన్​ఎంఏ). మాస్కులు, పీపీఈ కిట్ల విషయంలో ఎదురైన అనుభవంతో ఇప్పటికే సిరంజీ, సూదుల ఉత్పత్తి సామర్థ్యం పెంచినట్లు పేర్కొంది.

COVID-19 vaccine: India Aatmanirbhar for syringes, says industry
సిరంజీల లభ్యతలో మన దేశం 'ఆత్మనిర్భర్ భారత్'​
author img

By

Published : Nov 24, 2020, 6:08 PM IST

కరోనా భూతాన్ని ఎదుర్కోవడానికి త్వరలోనే వ్యాక్సిన్​ రానుంది. ఈ నేపథ్యంలో టీకా వేయడానికి కావాల్సిన సిరంజీలు, సూదుల ఉత్పత్తి చేసే సామర్థ్యం తమకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది అఖిల భారత సిరంజీ, సూదుల ఉత్పత్తి సంఘం​(ఏఐఎస్​ఎన్​ఎంఏ). కరోనా టీకాలు వేసే కార్యక్రమంలో అవసరానికి అనుగుణంగా అదనపు సామర్థ్యంతో నెలకు 350 మిలియన్​ సిరంజీలు ఉత్పత్తి చేయగలమని ఏఐఎస్​ఎన్​ఎంఏ పేర్కొంది.​

కరోనా సోకకుండా వినియోగించే మాస్క్​లు, పీపీఈ కిట్ల ఉత్పత్తిలో అనుభవం ద్వారా సిరంజీల తయారీ సంస్థలు ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పనిలో పడ్డాయని లేఖలో వివరించింది ఏఐఎస్​ఎన్​ఎంఏ. "సిరంజీల లభ్యతలో మన దేశం 'ఆత్మనిర్భర్ భారత్​' అని అసోసియేషన్​ సభ్యులు దేశానికి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు. రాబోయే అవసరాల కోసం ఇతర దేశాల వైపు చూడకూడదు" అని పేర్కొంది.

'అసోసియేషన్​ సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఫలితంగా సిరంజీలు, సూదులను కావాల్సిన మోతాదులో సమర్థంగా సరఫరా చేయగలం. ఈ సంక్షోభ సమయంలో మానవత్వంతో దేశానికి సేవ చేయడానికి అవకాశం కల్పిస్తారని భావిస్తున్నాం' అని మోదీకి రాసిన లేఖలో తమ అభిప్రాయాన్ని తెలిపారు ఏఐఎస్​ఎన్​ఎంఏ సభ్యులు.

ఇదీ చూడండి: ఎంబీబీఎస్​ చదివి యాచకవృత్తిలో .. పోలీసుల సాయంతో క్లీనిక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.