త్వరలోనే.. కరోనా పరీక్షలు, చికిత్సలు కూడా ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వచ్చే అవకాశముందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయుష్మాన్ భారత్ నిర్వహణను పర్యవేక్షిస్తున్న జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్ధ... ఈ విషయంపై ఇప్పటికే దాని పరిపాలనా బోర్డును అభ్యర్ధించింది.
"అనుమతి వచ్చిన వెంటనే ఆయుష్మాన్ భారత్ కింద కొవిడ్-19 పరీక్షలు, దానికి చికిత్సలు అందజేస్తాం. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే ఆయుష్మాన్ భారత్ లబ్దిదారులకు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉచిత చికిత్స సదుపాయం కలిగేలా చూస్తాం." - కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు
2011 సాంఘిక, ఆర్థిక, కుల జనాభా లెక్కల ప్రకారం, 10.74 కోట్లకు పైగా పేద, బలహీన కుటుంబాల వారికి పీఎమ్జేఏవై పథకం కింద లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆయుష్మాన్ భారత్ కింద లబ్దిదారుల కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల ఉచిత చికిత్సా సదుపాయం అందుతుంది.
మహమ్మారి కరోనా భారత్‌లో అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో దాని పరీక్షలు, చికిత్స విషయంలో సామాన్యులు, పేదలకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా కరోనా పరీక్షలు, చికిత్సను ప్రభుత్వ బీమా పథకం ఆయుష్మాన్ భారత్‌లో చేర్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: 8 నెలల తరువాత ఒమర్ అబ్దుల్లా విడుదల