దేశవ్యాప్తంగా రోజుకు సగటున 30వేల చొప్పున కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 30,254 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 98లక్షల 57వేల 29కి పెరిగింది. మహమ్మారి ధాటికి మరో 391 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య లక్షా 43వేల 19కి పెరిగింది.
రికవరీ రేటు ఇలా..
తాజాగా సుమారు 33 వేల మంది వైరస్‌ను జయించగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 93లక్షల 57వేల 464కు పెరిగింది. 3లక్షల 56వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 94.93 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.45శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 10లక్షల 14వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 15కోట్ల 37లక్షలు దాటినట్టు తెలిపింది.
ఇవీ చదవండి: