కరోనా మహమ్మారి భారత్లో అంతకంతకూ విస్తరిస్తోంది. లాక్డౌన్ కొనసాగుతున్నా... వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్లో ఇప్పటి వరకు 114 మంది కరోనా ధాటికి బలవ్వగా... మొత్తం కేసుల సంఖ్య 4,421కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
"ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,981గా ఉంది. 325 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల్లో 66 మంది విదేశీయులు కూడా ఉన్నారు." - కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
కరోనా మరణమృదంగం
ఆరోగ్యమంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం... మహారాష్ట్రలో అత్యధికంగా 45 కరోనా మరణాలు సంభవించాయి. ఇవాళ రాజస్థాన్లో ముగ్గురు వైరస్ సోకి మరణించారు. త్రిపురలో మొదటి కరోనా కేసు నమోదైంది.
ఇదీ చూడండి: ఆ ఔషధం ఎగుమతులపై నిషేధం పాక్షికంగా ఎత్తివేత!