కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశాల్లోని భారతీయులకు పలు మార్గదర్శకాలు జారీ చేశాయి భారత రాయబార కార్యాలయాలు. వైరస్ నుంచి తమను తాము జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించాయి.
కెనడా, గ్రీస్, ఫిన్లాండ్, ఎస్టోనియా, ఇజ్రాయెల్, జపాన్, వియత్నాం, బల్గేరియా, ఉత్తర మాసిడోనియా, రష్యా, క్యూబా, బ్రెజిల్, స్విట్జర్లాండ్‌ల్లోని రాయబార కార్యాలయాలు ఆయా దేశాల్లోని భారతీయులకు ఇప్పటికే అడ్వైజరీలు జారీ చేశాయి.
ఫ్రాన్స్‌లోని రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 22 నుంచి వారంపాటు భారత్‌కు వచ్చే వాణిజ్య విమానాల రాకపోకలపై నిషేధం విధించిన నేపథ్యంలో స్వదేశానికి రావాలని అనుకునేవారికి సమాచారం అందించింది.
ప్యారిస్ నుంచి బయల్దేరాల్సిన ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అయ్యే సమయాన్ని ఇప్పటికే ప్రకటించింది రాయబార కార్యాలయం.
"ఖతార్ విమానయాన సంస్థ ఫ్రాన్స్ నుంచి ఒక సర్వీసును నడుపుతోంది. భారత్‌కు వెళ్లాలి అనుకునేవారు పారిస్‌లో అందుబాటులో ఉండే ఈ సర్వీసు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మరో విమానాన్ని ఏర్పాటు చేయాలంటే రాయబార కార్యాలయానికి సమస్యగా పరిణమించవచ్చు."
-ఫ్రాన్స్‌లోని భారత కార్యాలయం
గ్రీస్‌లో..
గ్రీస్ దేశంలోని విద్యార్థులు జాగ్రత్త వహించాలని అక్కడి రాయబార కార్యాలయం సూచించింది. భారత్, గ్రీస్ ప్రభుత్వాలు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది.
కజకిస్థాన్, కెనడాలో..
కజకిస్థాన్‌లోని విద్యార్థులు అల్మాటీ విమానాశ్రయంలో భారత విమానం కోసం వేచి చూడాలని తెలిపింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌లోని భారతీయులు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని అక్కడి ఎంబసీ సూచించింది. కెనడాలోని భారతీయులు సురక్షితంగా ఉండేందుకు స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని చెప్పింది మన రాయబార కార్యాలయం.
ఇదీ చూడండి: ఇది కరోనా కాలం.. బాధ్యత ఉండక్కర్లేదా?