ETV Bharat / bharat

కరోనా పంజా: 12 గంటల్లో 25 మంది మృతి

కరోనా వైరస్ కారణంగా గత 12 గంటల్లో 25మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్​లో మృతుల సంఖ్య 149కు చేరింది. దేశంలో ప్రస్తుతం 4643 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 401మందికి వ్యాధి నయమైంది. మొత్తంగా 5194మందికి వైరస్ సోకింది.

corona
దేశంలో కరోనా విజృంభణ.. 12 గంటల్లో 25మంది మృతి
author img

By

Published : Apr 8, 2020, 10:51 AM IST

కరోనా వైరస్​ భారత్​పై పంజా విసురుతోంది. మొత్తంగా 5,194మందికి వైరస్ సోకినట్లు నిర్ధరించారు అధికారులు. 12 గంటల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఫలితంగా... వైరస్ కారణంగా కన్నుమూసిన వారి సంఖ్య 149కి చేరింది. దేశంలో 4643 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

పుణెలో ఇద్దరు..

మహారాష్ట్రలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. పుణెలో వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా లక్షణాలతో పుణెలోని ఆసుపత్రిలో చేరాడు ఓ వ్యక్తి. మంగళవారం ఆరోగ్యం క్షీణించిన కారణంగా మృతి చెందాడు. నగరంలోని సస్సూన్ ఆసుపత్రిలో వైరస్ కారణంగా మరో వ్యక్తి మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పుణెలో మహమ్మారితో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మొత్తంగా మహారాష్ట్రలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు.

ధారావిలో మరో ఇద్దరికి..

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ముంబయి ధారావిలో మరో ఇద్దరికి కరోనా సోకినట్లు తేలింది. తాజా కేసులతో ధారావిలో వైరస్ బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

గుజరాత్​లో..

గుజరాత్​లో మరో నలుగురికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 179కి చేరింది.

corona digits
దేశంలో కరోనా గణాంకాలు

ఇదీ చూడండి: కరోనా నుంచి కోలుకున్నాక ఇలా చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.