ETV Bharat / bharat

'మహా'పై కరోనా పంజా.. దిల్లీలో 60 వేలకు చేరువలో కేసులు - CORONA VIRUS MAHARASTRA

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. మహారాష్ట్ర సహా దేశ రాజధాని దిల్లీలో వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో ఆదివారం 3,870 కేసులు నమోదయ్యాయి. దిల్లీలో వరుసగా మూడో రోజు వైరస్​ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. దేశ రాజధానిలో వైరస్​ కేసుల సంఖ్య 60 వేలకు చేరువైంది. గుజరాత్​, ఉత్తర్​ప్రదేశ్​లో 500కుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.

COVID-19: Delhi records 3,000 cases; 63 more die, say authorities
దిల్లీలో 60వేలకు చేరువలో కరోనా కేసులు
author img

By

Published : Jun 21, 2020, 10:50 PM IST

భారత్​ను కరోనా వైరస్​ పట్టి పీడిస్తోంది. అన్​లాక్​-1లో వైరస్​ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా మహారాష్ట్రలో తాజాగా 3,870 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,32,075కు చేరింది. 101 తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 6,170కి పెరిగింది.

మరోవైపు దేశ రాజధాని దిల్లీలో ఆదివారం 3 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్​ బాదితుల సంఖ్య 59,746కు చేరింది. దిల్లీలో 3,000కుపైగా కేసులు వెలుగుచూడటం వరుసగా ఇది మూడోసారి. ఆదివారం మరో 63 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2,175కు పెరిగింది.

గుజరాత్​లో ఉద్ధృతం...

గుజరాత్​లో తాజాగా 580 మంది కరోనా బారిన పడ్డారు. 25 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,317కు.. మరణాల సంఖ్య 1,664కు చేరింది.

బంగాల్​ విలవిల...

వైరస్​ ధాటికి బంగాల్​ విలవిలలాడుతోంది. ఈరోజు 414 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 13,495 మంది కరోనా బారినపడ్డారు. తాజాగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 555కు చేరింది.

రాష్ట్రంకొత్త కేసులుమొత్తం కేసులు
దిల్లీ300059,746
ఉత్తర్​ప్రదేశ్​59617,135
గుజరాత్​58027,317
బంగాల్​41413,495
హరియాణ41210,635
రాజస్థాన్​39314930
కేరళ1333,170
​పంజాబ్​1224,074
జమ్ముకశ్మీర్1225,956
గోవా64818

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.