ETV Bharat / bharat

'కరోనా రూపంలో భారత్​కు ఇది మంచి అవకాశం' - ఆయుష్మాన్​ భారత్​ తాజా వార్తలు

'ఆయుష్మాన్​ భారత్'​ పథకాన్ని విస్తరించేందుకు కరోనా రూపంలో మంచి అవకాశం భారత్​కు లభించిందని డబ్ల్యూహెచ్​ఓ అధిపతి టెడ్రోస్ అధనోమ్​ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపైనా దృష్టి పెట్టాలని సూచించారు.

VIRUS-WHO-INDIA-AYUSHMAN-BHARAT
టెడ్రోస్​ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్
author img

By

Published : Jun 6, 2020, 12:20 PM IST

కరోనా మహమ్మారి అనేక దేశాలకు సవాలు విసురుతోందని, అయితే భారత్​కు ఒక అవకాశం ఇచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది. ఆరోగ్య బీమా పథకం 'ఆయుష్మాన్ భారత్' వేగవంతం చేసేందుకు ఇదే సరైన సమయమని పేర్కొంది.

భారత్​లో కరోనా పరిస్థితిపై స్పందించిన టెడ్రోస్​.. వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోందని స్పష్టం చేశారు. కేసుల సంఖ్యలో ఇటలీని దాటి ఆరో స్థానానికి చేరిందని తెలిపారు.

"కరోనా వైరస్​ చాలా దేశాలకు సవాల్​ విసురుతోంది. కానీ అవకాశాలపైనా మనం దృష్టి పెట్టాలి. ఉదాహరణకు.. భారత్​లో ఆయుష్మాన్​ భారత్​ బీమా పథకాన్ని వేగవంతం చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలి. ఆయుష్మాన్​ భారత్​ను విస్తరించేందుకు భారత ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని నాకు తెలుసు. ఈ విపత్తును మనం అధిగమించగలమని నమ్మకం ఉంది."

- టెడ్రోస్​ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్

నరేంద్రమోదీ ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన ఆయష్మాన్​ భారత్​ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం ద్వారా కోటి మంది లబ్ధి పొందారని మోదీ గత నెలలో ప్రకటించారు. ఆయుష్మాన్​ భారత్​ ద్వారా 50 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ ఉంటుంది.

ఇదీ చూడండి: ఇటలీని దాటేసిన భారత్​- 24 గంటల్లో 9,887 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.