ETV Bharat / bharat

జేఈఈ మెయిన్స్​ అభ్యర్థులకు తీపి కబురు

కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో జేఈఈ మెయిన్స్​ విద్యార్థులకు ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. జేఈఈ మెయిన్స్​లో అర్హత సాధించి.. నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(నిట్​)లో చేరదలిచే విద్యార్థులకు ఇంటర్​ మార్కుల నిబంధనను ఎత్తివేసింది.

COVID-19: Admission criteria for NITs relaxed; minimum 75 pc marks in Class 12 not required
జేఈఈ మెయిన్స్​ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు
author img

By

Published : Jul 23, 2020, 4:31 PM IST

కరోనా సంక్షోభం దృష్ట్యా జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు ఊరట కలిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్​లో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఈ ఏడాది నేషనల్​ ఇన్​స్టిట్యూట్స్​ ఆఫ్​ టెక్నాలజీ(నిట్​)లో చేరాలంటే ఇంటర్​లో 75 శాతం మార్కుల తప్పనిసరి నిబంధనను తొలగించారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ నిశాంక్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

ఇంటర్​ మార్క్స్​ మెమో ఉంటే చాలు..

గతంలో జేఈఈ మెయిన్స్​లో అర్హత సాధించినా.. ఇంటర్​లో 75 శాతం మార్కులు లేదా మొదటి 20 పర్సంటైల్లో ఉండాలనే నిబంధన ఉండేది. ఆ నిబంధనను ఈ ఏడాది ఎత్తివేశారు. 2020లో ఇంటర్మీడియట్​ పాసైన విద్యార్థులకు ఇది వర్తించనుంది. ఈమేరకు విద్యార్థులు మార్కులతో సంబంధం లేకుండా ఇంటర్ పాసైనట్లు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది.

ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ జేఈఈ మెయిన్స్​ను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.