ETV Bharat / bharat

'ఆమె' బెయిల్​ రద్దుపై విచారణ వాయిదా - FIR

మోసం కేసులో సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని బెయిల్​ రద్దు విచారణను దిల్లీ కోర్టు మే 23కు వాయిదా వేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి​పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఆమే.

'ఆమె' బెయిల్​ రద్దుపై విచారణ వాయిదా
author img

By

Published : Apr 24, 2019, 3:58 PM IST

Updated : Apr 24, 2019, 4:54 PM IST

'ఆమె' బెయిల్​ రద్దుపై విచారణ వాయిదా

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగొయి​పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళకు బెయిల్​ రద్దుపై విచారణను దిల్లీ కోర్టు వాయిదా వేసింది. దిల్లీ పోలీసుల విజ్ఞప్తిపై మే 23న విచారణ చేపడతామని తెలిపింది.

మోసం కేసు...

సీజేఐపై ఆరోపణలు చేసిన మహిళపై... గతంలో మోసం కేసు నమోదైంది. హరియాణాకు చెందిన నవీన్​ కుమార్​ తిలక్​మార్గ్​లోని పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆమె తనకు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.50 వేలు లంచం తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. మార్చి 3న మోసం, బెదిరింపు, నేరపూరిత కుట్ర కేసులను పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్​పై ఉన్నారు.

ఆమె ఫిర్యాదుదారుడ్ని బెదిరిస్తున్నారని, బెయిల్​ రద్దు చేయాలని దిల్లీ పోలీసులు కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్​ నకలు ఇంకా ఆమెకు అందలేదనే కారణంతో విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇదీ చూడండి :'విపక్షాలు ఓటమిని అంగీకరించక తప్పదు'

Patna (Bihar) Apr 16 (ANI): While speaking to mediapersons on Congress president Rahul Gandhi's statement 'Why all thieves have Modi in their surnames' Bihar Deputy CM Sushil Modi said, "I will file a defamation case against Rahul Gandhi in a Patna court. Is it a crime to have 'Modi' surname? He has referred to crores of people as 'chor' and hurt their sentiments."
Last Updated : Apr 24, 2019, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.