ETV Bharat / bharat

క్షమాభిక్ష అర్జీపై నిర్భయ దోషులకు వారం గడువు - NIRBHAYA LATEST NEWS

​​​​​​నిర్భయ దోషులకు శిక్ష అమలుపై విచారణ చేపట్టింది దిల్లీ పటియాల హౌస్​ కోర్టు. రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు చేసుకునే అంశంపై దోషులకు ఒక వారం గడువునిస్తూ తిహార్​ జైలుకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.

Court directs Tihar authorities to seek convicts' response on filing of mercy pleas in Nirbhaya case
క్షమాభిక్ష అర్జీపై నిర్భయ దోషులకు వారం గడువు
author img

By

Published : Dec 18, 2019, 5:14 PM IST

2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకునే అంశంపై దోషుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఒక వారం గడువునిస్తూ.. తిహార్​​ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది దిల్లీ పటియాల హౌస్​ కోర్టు. నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్​ కుమార్​ సింగ్​ రివ్యూ పిటిషన్​ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నేడు తీర్పునిచ్చిన నేపథ్యంలో దిల్లీ కోర్టు ఆదేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

దోషులకు ఉరిశిక్షను వెంటనే అమలు చేయాలని నిర్భయ తల్లి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టారు అదనపు సెషన్స్​ జడ్జి సతీశ్​ కుమార్​ అరోరా. డెత్​ వారెంట్​ ఇవ్వాలని నిర్భయ తల్లి తరఫున న్యాయవాది జడ్జిని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం... తిహార్​ జైలు అధికారులకు తాఖీదులిచ్చింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.

నిర్భయ తల్లి కన్నీరు...

విచారణ సమయంలో నిర్భయ తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'మేము వెళ్లిన ప్రతి చోట... ఊరట పొందేందుకు తమకు న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయని వారు(దోషులు) అంటున్నారు. ఏంచెయ్యాలి?' అని నిర్భయ తల్లి అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

రోదిస్తున్న నిర్భయ తల్లిని ఓదార్చారు జడ్జి. 'నాకు మీపై సానుభూతి ఉంది. మీ కుటుంబంలో ఒకరు చనిపోయారని నాకు తెలుసు. కానీ వారికి(దోషులు) కూడా హక్కులున్నాయి. మీరు చెప్పేది వినడానికే మేము ఉన్నది. కానీ మేము చట్టానికి కట్టుబడి ఉన్నాము' అని అన్నారు.

ఇదీ ఘటన

2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకడు మైనర్​ కాగా.... మరొకడు తిహార్​ జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన దోషులైన ముకేశ్​, పవన్​ గుప్తా, వినయ్​ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది. మరో దోషి అక్షయ్​ కుమార్ సింగ్​.. మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ తాజాగా సుప్రీంను ఆశ్రయించాడు. దీనినీ ఈ ఉదయం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

ఇదీ చూడండి:- 'ఉరితీసే అవకాశమివ్వండి..' రక్తంతో క్రీడాకారిణి లేఖ

Special Advisory
Wednesday 18th December 2019
Clients, please note we will not provide the following story today after all.
CRICKET: Pakistan and Sri Lanka get set for the second Test in Karachi.
Please see the stories 5211383 and 5211387 for preview news coverage.
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.