ETV Bharat / bharat

జూన్‌లో మరింత తీవ్రంగా వైరస్‌ ప్రభావం! - coronavirus latest news

గత కొన్ని రోజులుగా భారత్​లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జూన్​లో ఈ పరిస్థితులు మరింత దారుణంగా ఉండనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు కేసులు బయటపడని ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు. దీని వల్ల లక్షణాలు కనిపించకుండా వైరస్‌ వ్యాప్తి చేసే వారిని గుర్తించవచ్చన్నారు.

country may see an increase in coronavirus cases in the next few weeks
జూన్‌లో మరింత పెరగనున్న కరోనా కేసులు.. వైద్య నిపుణుల అంచనా
author img

By

Published : May 25, 2020, 2:42 PM IST

భారత్​వ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరింత తీవ్రం కానుంది. జూన్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండనున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసుల కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. కానీ, ఆర్థికపరమైన ఆందోళనలు.. దశలవారీ సడలింపులకు కారణమయ్యాయి. మొదట లాక్‌డౌన్‌, తరువాత సడలింపులతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఆ దేశాల్లో ఏమవుతుంది!

మార్చి నెలలో ఇరాన్‌లో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో వాటి కట్టడికి అక్కడి ప్రభుత్వం అనేక నిబంధనలను విధించింది. తరవాత ఏప్రిల్‌లో కేసులు తగ్గడం, కోలుకునే వారి సంఖ్య పెరగడంతో సడలింపుల వైపు మొగ్గు చూపింది. ఇప్పుడు రెండో సారి వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం లాక్‌డౌన్ తదనంతర పరిణామాలకు నిదర్శనం. ఇప్పటికే వైరస్‌ ప్రభావంతో అల్లకల్లోలమైన స్పెయిన్‌, బ్రిటన్‌ దేశాలు కొద్దిగా నిబంధనలు సడలించాయి. అక్కడ మరోసారి కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దక్షిణ కొరియాది దాదాపు ఇదే పరిస్థితి. అక్కడ బార్లు, క్లబ్బులకు అనుమతి ఇచ్చారు. కానీ, అక్కడ కొన్ని క్లబ్బుల కారణంగా వందల సంఖ్యలో కొత్త కేసులు వచ్చాయి. కరోనాను దాదాపుగా కట్టడి చేశామని చెప్పిన చైనాలోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.

జూన్​లోనే అధికంగా

ఇదిలా ఉండగా, రెండు నెలల లాక్‌డౌన్‌ తరవాత కూడా భారత్‌లో వైరస్‌ బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 'బిహార్‌లో కేర్‌ ఇండియా' బృందానికి నాయకత్వం వహిస్తున్న అంటువ్యాధుల నిపుణులు తన్మయ్ మహాపాత్ర కేసుల సంఖ్య పెరగడానికి పరీక్షల సంఖ్య పెరగడం కూడా కారణం కావొచ్చన్నారు. అలాగే ఇప్పటి వరకు కేసులు నమోదు కానీ ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహించాలని, దాని ద్వారా లక్షణాలు కనిపించకుండా వైరస్‌ వ్యాప్తి చేసే వారిని గుర్తించవచ్చన్నారు. గత వారం రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్యకు సడలింపులను కారణంగా చెప్పలేమని, ఆ ప్రభావం రానున్న రోజుల్లో తెలుస్తుందని చెప్పారు. 'భారత్‌ను ఎప్పటికీ లాక్‌డౌన్‌లో ఉంచలేం. కొన్ని సడలింపులు ఇవ్వడం చాలా అవసరం. దానర్థం ప్రజలు ఎప్పటిలాగే ప్రయాణాలు చేయొచ్చని కాదు. కరోనా తీవ్రత పరంగా మనం ఇంకా దారుణ స్థాయికి చేరలేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఏప్రిల్, మే కంటే జూన్‌లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. జులైలో తార స్థాయికి చేరుకొనే అవకాశం ఉంది' అని వెల్లడించారు.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఈద్​ వేడుకలు.. మోదీ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.