ETV Bharat / bharat

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి-సోనియా - 'భవన నిర్మాణ కార్మికులను కేంద్రం ఆదుకోవాలి'

భవన నిర్మాణ కార్మికులను కేంద్రం ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి వేతన మద్దతు ప్రకటించాలని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

coronavirus-sonia-gandhi-writes-to-pm-modi-pitches-for-support-to-workers-in-informal-sector
'భవన నిర్మాణ కార్మికులను కేంద్రం ఆదుకోవాలి'
author img

By

Published : Mar 24, 2020, 6:03 PM IST

భవన నిర్మాణ కార్మికులకు కేంద్రం వేతన మద్దతు ప్రకటించాలన్నారు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె లేఖ రాశారు.

coronavirus-sonia-gandhi-writes-to-pm-modi-pitches-for-support-to-workers-in-informal-sector
'భవన నిర్మాణ కార్మికులను కేంద్రం ఆదుకోవాలి'

భారత్​లో దాదాపు 500 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో.. వైరస్​ వ్యాప్తి మరింత విస్తరించకుండా 548 జిల్లాల్లో లాక్​డౌన్ అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ లాక్​డౌన్​ కారణంగా నాలుగున్నర కోట్ల మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు జీవనాధారం కోల్పోయారని సోనియా గాంధీ తెలిపారు. అలాంటి వారిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రధానిని కోరారు.

"కరోనా కట్టడికి కేంద్రం తీసుకున్న లాక్​డౌన్​ చర్యలు.. అనధికారిక రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక అంతరాలకు దారి తీస్తున్నాయి. నగరాల్లో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. ఈ అసాధారణ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, అత్యవసర చర్యలను చేపట్టాలని కోరుతున్నాను. రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులకు వేతన మద్దతు ప్రకటించాలి. "

- సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధినేత్రి

కెనడా వంటి ఎన్నో దేశాలు కూలీలకు సబ్సిడీని ప్రకటించాయని, భారత్​ కూడా అదే మార్గంలో నడిచి కార్మికులను ఆదుకోవాలని కోరారు సోనియా.

ఉపాధి నియంత్రణ సేవా నిబంధనల చట్టం-1996 కార్మికులకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తోందని.. ఈ చట్టం ఆధారంగా రాష్ట్ర సంక్షేమ బోర్డులు, సంక్షేమ నిధులు ఏర్పాటు చేయొచ్చని పేర్కొన్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

ఇదీ చదవండి:'దేశదేశాలు తిరిగి సేవచేస్తుంటే అవమానిస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.