ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: పార్లమెంటు​ సందర్శన పాసులు రద్దు - Casinos, pubs, other public places to remain closed in Goa

కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నివారణ చర్యలు కొనసాగుతున్నాయి. పార్లమెంటును సాధారణ ప్రజలు సందర్శించేందుకు ఇచ్చే పాసులను రద్దు చేసింది లోక్​సభ సచివాలయం. గోవాలో కరోనా కేసులు లేనప్పటికీ.. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను మూసివేసింది అక్కడి ప్రభుత్వం.

Coronavirus scare
కరోనా ఎఫెక్ట్​: పార్లమెంట్​ సందర్శన పాసులు రద్దు
author img

By

Published : Mar 15, 2020, 5:34 AM IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలు నివారణ చర్యలు చేపట్టాయి. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యాపార సముదాయాలను మూసివేస్తున్నాయి.

పార్లమెంటు​లోకి ప్రవేశం రద్దు

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో లోక్​సభ సచివాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సాధారణ ప్రజలు పార్లమెంటు​ ఆవరణలోకి వచ్చేందుకు ఇచ్చే పాసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలతో పార్లమెంటు భవనాన్ని ప్రజలు సందర్శించేందుకు అవకాశం లేదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు అధికారులు. పాసులు ఇవ్వాలని సిఫార్సులు చేయొద్దని పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేసింది లోక్​సభ సచివాలయం.

గోవాలో అన్నీ బంద్​

పర్యటక ప్రాంతం గోవాలో ప్రస్తుతం కరోనా కేసు నమోదు కాకపోయినప్పటికీ.. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఈనెలాఖరు వరకు విద్యాసంస్థలు, క్యాసినోలు, స్విమ్మింగ్​ పూల్స్​, పబ్బులు, థియేటర్లు, మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. 10, 12వ తరగతి పరీక్షలు యథావిథిగా కొనసాగుతాయని తెలిపింది ప్రభుత్వం.

రైళ్లలో దుప్పట్లు ఇవ్వరు

కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా రైళ్లలోని ఏసీ​ కంపార్ట్​మెంట్లో దుప్పట్లు, కర్టేన్లు అందించకూడదని నిర్ణయించినట్లు ఆగ్నేయ రైల్వే విభాగం, ఈస్ట్​కోస్ట్​ రైల్వే ప్రకటించింది. ఈ రెండు జోన్ల పరిధిలో నడిచే అన్ని రైళ్లకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రయాణికులకు అవసరమైనంత మేర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తున్నందున దుప్పట్లు అవసరం లేదని ఎస్​ఈఆర్​ ప్రతినిధి సంజయ్​ ఘోష్​ తెలిపారు. ఎవరికైనా కావాలంటే.. అందిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: 72 అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.