ETV Bharat / bharat

'భయం వద్దు... గాలి ద్వారా కరోనా వ్యాపించదు'

author img

By

Published : Jul 6, 2020, 7:34 PM IST

కరోనా వైరస్ వేగంగా ప్రపంచాన్ని చుట్టేసింది. ఇంతలా మహమ్మారి వ్యాపించటానికి గల కారణాలు ఇప్పటికి తెలియలేదు. అయితే ఈ వైరస్​ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న వార్త ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా గాలి ద్వారా వ్యాపించదని తెలిపారు సెంట్రల్‌ సైన్స్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్ జనరల్‌ శేఖర్‌ మండే.

Coronavirus Not Airborne But Must Be Careful In Closed Spaces: Scientist
గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించదు!

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అర్రులు చాస్తోంది. నెలల వ్యవధిలోనే భూగోళాన్ని చుట్టేసింది. ఈ వైరస్‌కు ఔషధాన్ని కనుగొనే పనిలో పలు ఔషధ కంపెనీలు తలమునకలవుతున్నాయి. మరోవైపు ఈ వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతోందన్న దానిపై స్పష్టమైన సమాచారం లేకపోవడం ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇటీవల కాలంలో ఈ వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందన్న వినిపిస్తున్నాయి. ఈ వాదనకు మరింత బలం చేకూర్చేలా 32 దేశాలకు చెందిన 239 మంది వైద్యుల బృందం డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాసింది. దీనికి స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నట్లు చెప్పడం గమనార్హం. అయితే తాజాగా కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించేది కాదని సెంట్రల్‌ సైన్స్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్ జనరల్‌ శేఖర్‌ మండే ఓ వార్త సంస్థతో చెప్పారు. "కరోనా గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ కాదు. కానీ, ఈ వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం వల్ల వెలువవడే తుంపర్ల ద్వారా మరొకరికి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు అడ్డుకోవచ్చు" అని వివరించారు శేఖర్‌.

"చికెన్‌పాక్స్‌,ఇన్‌ఫ్లూయెంజా, కొన్ని రకాల ఫ్లూ వైరస్‌లు గాలి ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. కానీ తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వస్తున్నందున దీనిని గాలి ద్వారా సంక్రమించే వ్యాధిగా అభిప్రాయపడుతున్నారు" అని ఆయన చెప్పుకొచ్చారు. వైద్యుల బృందం డబ్ల్యూహెచ్‌వోకు లేఖరాసిన విషయంపై స్పందిస్తూ.. ఈ విషయాన్ని నిర్ధరించడం అంత సులువేమీ కాదని, సాంకేతిక ఆధారాల కోసం డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నిస్తోందని తెలిపారు.

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందబోదని, మీరు డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాశారా? అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పటి వరకు ఎలాంటి లేఖలు రాయలేదని, అవసరమైతే త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశముందని శేఖర్‌ మండే అన్నారు. మరోవైపు వైరస్‌ సోకకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శేఖర్‌ మండే సూచించారు. వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఇంటికే పరిమితం కావాలన్నారు. మాస్కులు ధరించాలని, కరోనా రోగులకు చికిత్స చేస్తున్న సిబ్బంది తప్పని సరిగా ఎన్‌95 మాస్కులు ధరించాలని కోరారు.

ఇదీ చూడండి:ప్రముఖ సినీనటి సుమలతకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.