దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. సోమవారం ఒక్కరోజు 55,079 మందికి వైరస్ సోకింది. మరో 876 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 27లక్షలను అధిగమించింది.
మహమ్మారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. కొవిడ్ మరణాల రేటు కూడా క్రమంగా క్షీణిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది.
రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు..
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కొవిడ్ నిర్ధరణ పరీక్షల సంఖ్యను రోజురోజుకు పెంచుతున్నారు. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 8.97 లక్షల పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్కరోజులో చేసిన వైరస్ టెస్టుల్లో ఇదే అత్యధికం.
ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా