మద్యం తాగి వాహనం నడిపేవారిని గుర్తించే బ్రీత్ అనలైజర్ టెస్టును తాత్కాలికంగా నిలిపివేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఈ మేరకు ఆ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
"రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. మరింత విస్తరించకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాం. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన చోదకులు మద్యం తాగారా, లేదా అని నిర్ధరించే బ్రీత్ అనలైజర్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపేశాం. "
-మహారాష్ట్ర హోంశాఖ ప్రకటన
అయితే పోలీసులు సాధారణంగా చేపట్టే వాహన తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు చేశారు అధికారులు. కరోనా తగ్గుముఖం పట్టాకే బ్రీత్ అనలైజర్ పరీక్షలను పునఃప్రారంభిస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: 'రానున్న 6 నెలలు భారతీయులకు నరకమే'