ETV Bharat / bharat

కొవిడ్‌పై అధ్యయనానికి ఐదు పరిశోధన బృందాలు

author img

By

Published : Apr 8, 2020, 11:38 AM IST

కరోనా వైరస్‌పై అధ్యయనం చేయడానికి నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ అయిదు పరిశోధన బృందాలు ఏర్పాటు చేసింది. పరిశోధన ప్రాధాన్యాలను గుర్తించడం సహా పలు బాధ్యతలను అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పరిశోధన బృందాల విధివిధానాలను రూపొందించింది.

corona task force
కరోనా టాస్క్ ఫోర్స్

కరోనా వైరస్‌పై అధ్యయనం కోసం నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ అయిదు పరిశోధన బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందాల సభ్యులు తమకు అప్పగించిన అంశాలపై నిరంతరం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకుంటూ రీసెర్చి ప్రొటోకాల్స్‌ రూపొందించడంతో పాటు, ఇందులో దేశంలోని ఏయే సంస్థలను భాగస్వాములు చేయాలన్నది గుర్తించాలి.

1. క్లినికల్‌ రీసెర్చి గ్రూప్‌: ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 9 మంది సభ్యులు ఉంటారు.

విధివిధానాలు: పరిశోధన ప్రాధాన్యాలను గుర్తించడం. ఆధారాలను పరిశీలించడం, ప్రొటోకాల్స్‌ని రూపొందించి వాటి అమలుకు అనువైన సంస్థలను గుర్తించడం.

2. రీసెర్చ్‌ ఆన్‌ డయాగ్నాస్టిక్స్‌ అండ్‌ బయోమార్కర్స్‌: ఛైర్మన్‌గా డీఏ గడ్కరీతో పాటు 9 మంది సభ్యుల నియామకం.

విధివిధానాలు: పరిశోధన ప్రాధాన్యాలను గుర్తించడం. టెస్టింగ్‌ వ్యూహాలపై ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలివ్వడం.

3. ఎపిడమాలజీ అండ్‌ సర్వైలెన్స్‌: ఛైర్మన్‌ డీసీఎస్‌ రెడ్డితో పాటు 9 మంది సభ్యులు

విధివిధానాలు: లాక్‌డౌన్‌, పాక్షిక లాక్‌డౌన్‌పై నిర్ణయాలు. కాన్సెప్ట్‌ నోట్‌ తయారుచేయడం. అందుకు అనువైన ప్రొటోకాల్స్‌ రూపొందించడం.

4. ఆపరేషన్స్‌ రీసెర్చ్‌: 14 మంది సభ్యులు

5. వ్యాక్సిన్‌/డ్రగ్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌: ఛైర్మన్‌గా గగన్‌దీప్‌ కాంగ్‌, 8 మంది సభ్యులు

విధివిధానాలు: పరిశోధన ప్రాధాన్యాలను గుర్తించి భాగస్వాములను ఎంపికచేయడం.

ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్నాక ఇలా చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.