ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు - coronavirus latest news usa

corona
కరోనా పంజా
author img

By

Published : Apr 17, 2020, 8:34 AM IST

Updated : Apr 17, 2020, 11:07 PM IST

20:46 April 17

రాంచీలో మూడు కొత్త కేసులు

ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32కు పెరిగింది.

20:22 April 17

మధ్యప్రదేశ్​లో 146 కేసులు

మధ్యప్రదేశ్​లో ఈరోజు 146 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 69కి పెరిగింది.

20:02 April 17

గుజరాత్​లో 1,099

గుజరాత్​లో 78 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 1,099కి పెరిగింది. మృతుల సంఖ్య 41కిచేరింది.

20:00 April 17

యూపీలో 44 కొత్త కేసులు

ఉత్తర్​ప్రదేశ్​లో ఈరోజు నమోదైన 44 కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 849కి చేరింది. 

19:44 April 17

ముంబయిలో 2,120కి చేరిన కేసులు

దేశంలో కరోనా వ్యాప్తికి కేంద్రబిందువైన ముంబయిలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 77 కేసులు నమోదయ్యాయి. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2,120కి పెరిగింది. మృతుల సంఖ్య 121కి పెరిగింది.

19:14 April 17

తమిళనాడులో 56 కేసులు

తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1,323కి పెరిగింది. ఈరోజు కొత్తగా 56 కేసులు నమోదయ్యాయి.

19:10 April 17

పంజాబ్​లో 14 కొత్త కేసులు

పంజాబ్​లో​ ఇవాళ 14 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 211కు పెరిగింది. 13మంది ప్రాణాలు కోల్పోయారు.

19:08 April 17

పుణెలో 44ఏళ్ళ వ్యక్తి మృతి

కరోనా సోకి పుణెలో 44 వ్యక్తి మృతిచెందాడు. జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 49కి చేరింది. 

18:59 April 17

బ్రిటన్​లో 14,500 దాటిన మరణాలు

బ్రిటన్​లో ఒక్క రోజులో 847 కరోనా మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య 14,500 దాటింది. పాజిటివ్​ కేసుల సంఖ్య 1,09,000కు చేరువైంది.

18:17 April 17

బంగాల్​లో కొత్తగా 22 కేసులు

బంగాల్​లో ఇవాళ 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 255కు పెరిగింది. వైరస్​ సోకి ఇప్పటి వరకు 10 మంది మరణించారు.

18:09 April 17

కేరళలో ఒకే ఒక్క కేసు

కరోనాను విజయవంతంగా ఎదుర్కొంటున్న కేరళలో ఈరోజు కేవలం ఒక్కటే పాజిటివ్ కేసు నమోదైంది. మొత్తం 395 కేసులకు గాను, ప్రస్తుతం 138 మంది ఆస్పత్రులలో ఉన్నారు. మిగతా వారందరూ కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు. ముగ్గురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు.

18:04 April 17

ధారావీలో 100కుపైగా కరోనా కేసులు

మహారాష్ట్ర ధారావీ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య 101కి పెరిగింది. కొత్తగా 15 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.

17:35 April 17

13,835కు పెరిగిన కేసులు

దేశంలో కరోనా మృతుల సంఖ్య 452కు పెరిగింది. పాజిటివ్​ కేసుల సంఖ్య  13,835కి చేరింది. వైరస్​ బారి నుంచి కోలుకుని ఇప్పటివరకు  1,767 మంది డిశ్చార్జ్​ అయ్యారు. 24 గంటల్లో 1,076 కొత్త కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి.

17:07 April 17

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22,00,000కు చేరువైంది. మృతుల సంఖ్య 1,47,000 వేలు దాటింది. ఇప్పటి వరకు 5,57,000 మందికిపైగా వైరస్​ బారి నుంచి కోలుకున్నారు.

17:02 April 17

స్పెయిన్​లో 19,500కు పైగా మృతులు

స్పెయిన్​లో కరోనా మరణాల సంఖ్య 19,500 దాటింది. వైరస్  బాధితుల సంఖ్య 1,85,000కు చేరింది.

16:32 April 17

కరోనా సోకిన వారిలో 80శాతం మంది కోలుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. లాక్​డౌన్​కు ముందు కేసుల రెట్టింపునకు 3 రోజులు పడితే, ఇప్పుడు 6.2 రోజలు పడుతుందని పేర్కొంది. దేశంలోని 19 రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ రోజులే పడుతోందని వెల్లడించింది.  

వీలైనంత త్వరగా కరోనాకు వ్యాక్సీన్​కు తీసకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్య ఆరోగ్య కార్యదర్శి లవ్​ అగర్వాల్​ తెలిపారు. బీసీజీ, ప్లాస్మా థెరపీ, మోనోక్లోనో యాంటీ బాడీస్​పై ప్రయోగాలు వేగవంతం చేసినట్లు చెప్పారు.

15:37 April 17

కశ్మీర్​లో ఐదో మరణం..

కరోనా కారణంగా కశ్మీర్​లో ఈరోజు మరొకరు మృతి చెందారు. వైరస్​ సోకి ఇప్పటివరకు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

15:31 April 17

బిహార్​లో రెండో మరణం

కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల వ్యక్తి ఇవాళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇది రెండో మరణం. ఇప్పటివరకు 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15:08 April 17

రాజస్థాన్​లో మరో వ్యక్తి మృతి

కరోనా సోకి రాజస్థాన్​లో మరో వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ కొత్తగా 62 కేసులు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలో వైరస్​ కేసుల సంఖ్య 1,193కు పెరిగింది. మృతుల సంఖ్య 17కు చేరింది.

14:57 April 17

ఆర్బీఐపై మోదీ ప్రశంసలు

కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతాని ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలను ప్రశంసించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ద్రవ్య లభ్యతను పెంచడానికి ఇవి దోహదపడతాయని ట్వీట్ చేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు మేలు జరుగుతుందని, డబ్లూఎంఏ పరిమితులు పెంచడం అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరం అని స్పష్టం చేశారు. 

14:22 April 17

కరోనాపై పోరులో మోదీ ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదని చెప్పారు కేంద్ర హోమంత్రి అమిత్​ షా. ప్రజలకు తక్కువ ఇబ్బందులు ఎదురయ్యోలా, రాబోయే రోజుల మంచిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలపేతానికి ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలు మోదీ సంకల్పానికి  బలం చేకూర్చేలా ఉన్నాయని ప్రశంసించారు షా.

14:15 April 17

మహారాష్ట్రలో మరో 34 కేసులను గుర్తించారు. మొత్తం కేసుల సంఖ్య 3,236కు పెరిగింది.

13:48 April 17

మహారాష్ట్రలో మరో 288 కేసులు

దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 3,204కి చేరింది. ఇవాళ కొత్తగా 288 కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 194కి పెరిగింది.

13:23 April 17

తమిళనాడులో...

తమిళనాడులో జల్లికట్టు నిర్వహణ కోసం ఏకంగా 2వేల మంది లాక్​డౌన్​ను ఉల్లంఘించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

12:54 April 17

పుణెలో మరొకరు మృతి..

కరోనా బారినపడి పుణెలో మరో వ్యక్తి మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 48కి చేరింది.

12:42 April 17

కర్ణాటకలో 350కి పైగా..

కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 353కి చేరింది. ఈరోజు కొత్తగా 38 కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి వైరస్​ సోకింది. వైరస్​ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 13 మంది మరణించారు.

12:32 April 17

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో కరోనా కేసులు రోజురోజుకు మరిన్ని పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 155 కేసులు నమోదయ్యాయి. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 842కు పెరిగింది. మృతుల సంఖ్య 47కు చేరింది.

11:53 April 17

కరోనా నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పారాసెటమాల్​తో తయారయ్యే  ఫార్ములేషన్​ ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. 

11:32 April 17

కేంద్రమంత్రుల సమావేశం

దిల్లీలోని నిర్మాణ్ భవన్​లో కరోనా పరిస్థితిని  సమీక్షించేందుకు కేంద్రమంత్రులు సమావేశమయ్యారు. సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​, కేంద్ర ఆరోగ్య మంత్రి డా.హర్షవర్ధన్​, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్​ జై శంకర్​ హాజరయ్యారు.

11:12 April 17

గుజరాత్​లో 1,000 దాటిన కేసులు

గుజరాత్​లో మరో 92 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 1,021కి చేరింది. వైరస్​ కారణంగా రాష్ట్రంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

10:58 April 17

రాజస్థాన్​లో 1,169కి పెరిగిన కేసులు

రాజస్థాన్​లో ఈరోజు కొత్తగా 38 కేసులు నమోదయ్యాయి. వైరస్​ బాధితుల సంఖ్య 1,169కి పెరిగింది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు.

10:54 April 17

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1640కి చేరింది. మృతుల సంఖ్య 38కి పెరిగింది.

10:45 April 17

  • రెపో రేటు యథాతథం: ఆర్‌బీఐ గవర్నర్‌
  • రివర్స్‌ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గింపు: ఆర్‌బీఐ గవర్నర్‌
  • రాష్ట్రాలకు 60 శాతం మేర డబ్ల్యూఎంఏ పెంపు: ఆర్‌బీఐ గవర్నర్‌
  • సెప్టెంబరు 30 వరకు డబ్ల్యూఎంఏ పెంపు అమలు: ఆర్‌బీఐ గవర్నర్‌
  • లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టం: ఆర్‌బీఐ గవర్నర్‌
  • మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్‌పీఏ గడువు వర్తించదు: ఆర్‌బీఐ గవర్నర్‌

10:33 April 17

ఆర్​బీఐ గవర్నర్​ ప్రెస్​మీట్​ హైలైట్స్​:

  • కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ.50 వేల కోట్లతో ఎల్​టీఆర్​ఓ 2.0.
  • ఆర్​బీఐ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థలోకి రూ.50 వేల కోట్లు విడుదల. నాబార్డ్, సిడ్బీ, ఎన్​హెజ్​బీ వంటి ఆర్థిక సంస్థలకు రుణాల రూపంలో అందజేత.
  • రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. 4శాతం నుంచి 3.75శాతానికి చేరిన ఆర్​ఆర్​ఆర్​.
  • రెపో రేటు యథాతథం.

శక్తికాంత దాస్​ భరోసా

  • కరోనా సంక్షోభంతో ఏర్పడ్డ పరిస్థితుల్ని రిజర్వు బ్యాంకు ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.
  • కరోనా సంక్షోభం ఉన్నా సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చొరవ చూపాలి.
  • భారత్​ 1.9శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఐఎంఎఫ్​ అంచనా. మొత్తం జీ20 దేశాల్లో ఇదే అత్యధికం కావడం సంతృప్తికర అంశం.
  • 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా పుంజుకుంటుంది. ఐఎంఎఫ్​ అంచనాల బట్టి ఈ విషయం అర్థమవుతోంది. 7.4శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం.
  • మార్చిలో వాహనాల ఉత్పత్తి, అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. విద్యుత్ డిమాండ్ భారీగా క్షీణించింది.
  • 2008-09 ఆర్థిక మాంద్యాన్ని మించిన స్థాయిలో మార్చిలో ఎగుమతులు 34.6శాతం మేర తగ్గాయి.
  • లాక్​డౌన్​ వేళ ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ డౌన్​టైమ్​ లేదు. బ్యాంకింగ్ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి.
  • ద్రవ్య లభ్యత సరిపడా ఉండేలా చూసేందుకు, రుణ మంజూరు సజావుగా సాగేందుకు, ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించేందుకు త్వరలో చర్యలు

10:28 April 17

  • చిన్నతరహా పరిశ్రమలకు రూ.50 వేల కోట్లు: ఆర్‌బీఐ గవర్నర్‌
  • జాతీయ హౌసింగ్‌ బోర్డుకు రూ.10 వేల కోట్లు: ఆర్‌బీఐ గవర్నర్‌
  • నాబార్డుకు రూ.25 వేల కోట్లు: ఆర్‌బీఐ గవర్నర్‌
  • ఆటోమొబైల్ పరిశ్రమలో ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి: ఆర్‌బీఐ గవర్నర్‌
  • విద్యుత్ వినియోగం బాగా తగ్గింది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • ఆర్‌బీఐ చర్యల వల్ల బ్యాంకుల్లో సరిపడా ద్రవ్య లభ్యత ఉంది: ఆర్‌బీఐ గవర్నర్‌

10:24 April 17

  • జీ 20 దేశాల్లో భారత్‌ వృద్ధిరేటు గణనీయంగా ఉంది: ఆర్బీఐ గవర్నర్‌
  • బ్యాంకుల కార్యాకలాపాలు సాఫీగా సాగుతున్నాయి: ఆర్‌బీఐ గవర్నర్‌
  • లాక్‌డౌన్‌ తర్వాత రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశాం: ఆర్‌బీఐ గవర్నర్‌
  • జీడీపీలో 3.2 శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం : ఆర్‌బీఐ గవర్నర్‌
  • బ్యాంకుల్లో సరిపడా ద్రవ్యలభ్యత ఉంది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • లాక్‌డౌన్‌ వేళ మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు సజావుగా సాగుతున్నాయి
  • ఆర్థిక పరిస్థితులను మరింత సరళతరం చేశాం: ఆర్‌బీఐ గవర్నర్‌

10:18 April 17

  • 2020-21 ఏడాదికి భారత్‌ వృద్ధిరేటు 7.4 శాతం ఉంటుందని అంచనా
  • జీ-20 దేశాల్లో భారత్‌ వృద్ధిరేటు గణనీయంగా ఉంది: ఆర్బీఐ గవర్నర్‌
  • అనేక దేశాల వృద్ధిరేటు తిరోగమనంలో ఉంది: ఆర్బీఐ గవర్నర్‌
  • దేశవ్యాప్తంగా 91 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి: ఆర్బీఐ గవర్నర్‌
  • బ్యాంకులు ఏటీఎంల్లో ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నాయి: ఆర్బీఐ గవర్నర్‌

10:14 April 17

  • ప్రస్తుతం మానవాళి అతిపెద్ద మహమ్మారిని ఎదుర్కొంటోంది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • బ్యాంకులు, ఆర్థికసంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషిచేయాలి: ఆర్‌బీఐ గవర్నర్‌
  • ప్రపంచ మార్కెట్లన్నీ ఒడుదొడుకుల్లో ఉన్నాయి: ఆర్‌బీఐ గవర్నర్‌
  • సంక్షోభ సమయంలో బ్యాంకుల సేవలు ప్రశంసనీయం: ఆర్‌బీఐ గవర్నర్‌
  • ఖరీఫ్‌లో ధాన్యం ఉత్పత్తి 36 శాతం పెరిగింది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఏపీలో ధాన్యం ఉత్పత్తి పెరిగింది
  • భారత్ జీడీపీ 1.9 శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసింది

10:08 April 17

ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు  ఆర్‌బీఐ గవర్నర్‌ గవర్నర్​ శక్తికాంత దాస్​. దేశ ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని,

పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

09:56 April 17

కేంద్రం అనేక మార్గదర్శకాలు

  • ఈనెల 15న విడుదల చేసిన లాక్డౌన్ మార్గదరకాలలో కొన్ని సవరణలు చేసిన కేంద్రం.
  • చిన్న చిన్న అటవీ ప్రాంతాల్లో గిరిజనుల కార్యకలాపాలు, అటవీ ఉత్పత్తుల సేకరణ, పంటలు సాగు చేయడం, కలప సేకరణ వంటి వాటిని కూడా వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలల్లో చేర్చిన కేంద్రం.
  • కొబ్బరి, వెదురు, కోకోవ, సుగంధ ద్రవ్య దినుసుల సాగు, శుద్ధి చేయడం, ప్యాకేజింగ్ చేయడం, మార్కెటింగ్, అమ్మకాలు వంటి కార్యకలాపాలకు అవకాశం ఇచ్చిన కేంద్రం.
  • తక్కువ సిబ్బందితో కార్యకలాపాలు సాగించే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు, మైక్రో ఫైనాన్షియల్ సంస్థలకు అవకాశం.
  • గ్రామీణ ప్రాంతాల్లో జరిగే నిర్మాణ పనులు, నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, విద్యుత్ లైన్లు, టెలిఫోన్ లైన్లు, ఆప్టిక్ ఫైబర్ లైన్లు ఏర్పాటుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చిన కేంద్రం.
  • అన్ని శాఖల, విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ.
  • లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత అనేక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోం శాఖ.
  • ఈనెల 15న విడుదల చేసిన మార్గదర్శకాలలో పొందుపరిచిన పలు అంశాలకు మరికొన్ని జోడిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా

09:46 April 17

అగ్రరాజ్యం కొత్త రికార్డ్

అమెరికాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఒక్కరోజే ఆ దేశంలో 4,591 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 33 వేలు దాటింది. 6లక్షల 62 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు.

09:24 April 17

చైనా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. వుహాన్​లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యను ఒక్కసారే 1,290 మేర పెంచింది. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 3,869కి చేరింది. ఇది ఇప్పటివరకు ప్రకటించినదానికన్నా 50శాతం అధికం. 

మృతుల సంఖ్యలో చైనా ప్రభుత్వం ఒక్కసారిగా ఈ మార్పు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే... లెక్కింపులో పొరపాట్లు జరగడం, కొన్ని కేసుల్ని పరిగణనలోకి తీసుకోకపోవడమే ఇందుకు కారణమని వుహాన్​ అధికార యంత్రాంగం ఓ సోషల్​ మీడియా పోస్టులో వివరించింది. 

09:12 April 17

మరికాసేపట్లో ఆర్బీఐ గవర్నర్​ మీడియా సమావేశం

కరోనా కారణంగా భారీగా పతనమవుతున్న రూపాయి విలువ, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్​​ కొద్దిసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లాక్​డౌన్ విధించిన తర్వాత తొలిసారి ప్రసంగించనున్నారు. 

08:30 April 17

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,007 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 13,387
  • యాక్టివ్ కేసులు: 11,201
  • మరణాలు: 437
  • కోలుకున్నవారు: 1,748
  • వలస వెళ్లిన వారు: 1

Last Updated : Apr 17, 2020, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.