కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...
భారత్‌ను కరోనా వైరస్ కలవరపెడుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌పై వస్తున్న వదంతుల వల్ల సామాన్య ప్రజానీకం భయంతో విలవిలలాడుతోంది. వారి భయాలను రూపుమాపేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సందేహాలు నివృతి చేశాయి.
కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతోంది. ఈ వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తికి తోడు తప్పుడు వార్తలు వారి భయాలను రెట్టింపు చేస్తున్నాయి.
కరోనా వైరస్‌పై వస్తున్న వెల్లువెత్తుతున్న ప్రశ్నలను ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ, వ్యాధి నియంత్రణ-నివారణ కేంద్రం నిపుణులు నివృతి చేశారు. వైరస్ నుంచి కాపాడుకోవడానికి పలు సలహాలు ఇస్తున్నారు.
కరోనాపై ఇంత ఆందోళన ఎందుకు?
కొత్త వైరస్ వ్యాపించినప్పుడు అది ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు. ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలకు ధ్రువీకరించని వాస్తవాలు, వదంతుల వ్యాప్తి ప్రధాన కారణం.
కరోనా లక్షణాలు(జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం) కనిపించినప్పుడు మాత్రమే వైరస్ సోకినట్లు అనుమానించాలి. కింది వాటిలో ఏదైనా చేసినప్పుడు కరోనాపై అనుమానం వ్యక్తం చేయవచ్చు.
⦁ కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాలను ఇటీవలి కాలంలో సందర్శించడం.ఉదాహరణకు చైనా, ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా)
⦁ వైరస్ సోకిన వ్యక్తితో దగ్గరగా ఉండటం.
⦁ కరోనా రోగులకు చికిత్స అందించే ల్యాబ్‌లు, హెల్త్ కేర్ సెంటర్లను సందర్శించడం.
లక్షణాలను గుర్తించండి...
జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటివి కరోనా లక్షణాలుగా పరిగణించవచ్చు. ఇవన్నీ సాధారణంగా వచ్చే జలుబు, ఫ్లూ వంటి వ్యాధి లక్షణాలకు దగ్గరి పోలిక కలిగి ఉంటాయి. అనారోగ్య లక్షణాల తీవ్రత... వ్యక్తులను బట్టి వేరుగా ఉంటుంది.
జ్వరం, జలుబు, గొంతు నొప్పి ఉంటే భయపడకుండా పలు జాగ్రత్తలు వహించండి.
వస్తువులపై వైరస్ ఎంత కాలం బతుకుతుంది?
ఉపరితలాల (పేపర్, కలప, కార్డ్ బోర్డ్, స్పాంజ్, వస్త్రాలు)పై కరోనా 8-10 గంటలు జీవిస్తుంది. గాజు, లోహాలు, ప్లాస్టిక్ వంటి ఉపరితలాలపై అంతకన్నా ఎక్కువ సమయం బతికుండే అవకాశం ఉంది.
వెల్లుల్లితో కరోనాను నివారించవచ్చా?
వెల్లుల్లి తినడం వల్ల కరోనాను నివారించవచ్చనే విషయాన్ని నిర్ధరించే శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవు.
వేడి వాతావరణం కరోనాను అరికట్టగలదా?
వేడి వాతావరణం వైరస్ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనా వైరస్ ద్వారా పెంపుడు జంతువులకు ప్రమాదం ఉందా?
⦁ పెంపుడు జంతువులు లేదా ఇతర జంతువులకు కరోనా సోకినట్లు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
⦁ వైరస్ సోకిన వ్యక్తుల నుంచి వచ్చిన తుంపర్లు పెంపుడు జంతువుల శరీరంపై ఉండే అవకాశం ఉన్నందున.. వాటిని తాకే ముందు, తాకిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కరోనాను జయించడానికి మూడు సూత్రాలు:
⦁ మిమ్మల్ని మీరు రక్షించుకోండి
⦁ మీ ప్రియమైన వారిని రక్షించండి
⦁ మీ సమాజాన్ని రక్షించండి
ఆరోగ్యం సరిగా లేకుంటే ఆస్పత్రికి వెళ్లండి..
⦁ జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ఇంట్లోనే ఉండటం మేలు. వైద్యుడిని సంప్రదించి వారి సలహా పాటించండి.
⦁ వైరస్‌పై వదంతులు వ్యాప్తి చేయకండి. వైద్య నిపుణులు ఇచ్చే ప్రామాణిక సమాచారాన్ని మాత్రమే మిత్రులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి.
⦁ ఒకసారి వాడిపారేసే మూడు లేయర్ల సర్జికల్ మాస్కులు కరోనా వైరస్‌ను నిరోధించడానికి సరిపోతాయి.
⦁ ఎన్-95, ఎన్-99 మాస్కులు వాడటం తప్పనిసరేం కాదు.
మరిన్ని సలహాలకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదించండి.
ఫోన్ నెంబర్: +91-11-23978046
ఈ-మెయిల్: ncov2019@gmail.com
ఇదీ చదవండి:జలుబు, ఫ్లూ, కరోనా మధ్య తేడా ఏంటి?
కరోనా లక్షణాలు(జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం) కనిపించినప్పుడు మాత్రమే వైరస్ సోకినట్లు అనుమానించాలి. కింది వాటిలో ఏదైనా చేసినప్పుడు కరోనాపై అనుమానం వ్యక్తం చేయవచ్చు.
జ్వరం, జలుబు, గొంతు నొప్పి ఉంటే భయపడకుండా పలు జాగ్రత్తలు వహించండి.
కరోనా వైరస్ ద్వారా పెంపుడు జంతువులకు ప్రమాదం ఉందా?
కరోనాను జయించడానికి మూడు సూత్రాలు:
⦁ మీ సమాజాన్ని రక్షించండి
⦁ వైరస్‌పై వదంతులు వ్యాప్తి చేయకండి. వైద్య నిపుణులు ఇచ్చే ప్రామాణిక సమాచారాన్ని మాత్రమే మిత్రులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి.
Last Updated : Mar 15, 2020, 10:45 PM IST