ETV Bharat / bharat

రాజ్యసభ 'పెద్ద'లకు కరోనా భయం! - Rajya Sabha members

కరోనా వేళ పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై వారి కుటుంబాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వృద్ధులు అధికంగా ఉన్న రాజ్యసభ సభ్యుల పరిస్థితి చర్చనీయాశంగా మారింది. ఎగువసభలో 130 మంది 60 ఏళ్ల పైబడినవారే ఉన్నారు.

Rajya Sabha members
రాజ్యసభ 'పెద్ద'లకు కరోనా భయం!
author img

By

Published : Sep 5, 2020, 6:41 AM IST

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఈనెల 14నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంలో సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై వారి కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వృద్ధులు అధికంగా ఉన్న రాజ్యసభ సభ్యుల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాజ్యసభ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న 244 మంది సభ్యుల్లో 130 మంది 60 ఏళ్లపైబడిన వారే ఉన్నారు. ఇందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ (87) అందరికంటే పెద్దవారు. తర్వాతి స్థానంలో అకాళీదళ్‌ ఎంపీ సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా (84), తెరాస నేత కె.కేశవరావు (81), ఏఐఏడీఎంకె సభ్యుడు ఎస్‌.ఆర్‌.బాలసుబ్రహ్మణ్యన్‌ (81) ఉన్నారు.

ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని పార్లమెంటు ఉభయసభాపతులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతికదూరం నిబంధనలకు అనుగుణంగా సీట్లు ఏర్పాటుచేయడంతోపాటు, అన్ని చోట్లా శానిటైజర్లు, 72 గంటల ముందు పరీక్షల నిర్వహణను తప్పనిసరి చేశారు.

ఇదీ చూడండి: కరోనా నెగిటివ్​ రిపోర్ట్​ చూపితేనే పార్లమెంట్​లోకి అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.