ETV Bharat / bharat

ఆగని కరోనా విజృంభణ- భారీగా పెరిగిన కేసులు - Covid-19 pandemic in india

భారత్​లో కరోనా వైరస్ చాపకిందనీరులా దేశమంతటా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లోనే కొత్తగా 336 కరోనా కేసులు నమోదు కావడం.. వైరస్​ తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతానికి 2088 మంది వైరస్​తో పోరాడుతుండగా... 157 మంది కోలుకున్నారు. కాగా కరోనా ధాటికి ఇప్పటివరకు 56 మంది మరణించారు.

corona death toll in india
చాపకిందనీరులా విస్తరిస్తున్న కరోనా-భారీగా పెరిగన కేసులు
author img

By

Published : Apr 3, 2020, 6:02 PM IST

Updated : Apr 3, 2020, 6:34 PM IST

కరోనా వైరస్​ భారత్​లో అంతకంతకూ విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి ధాటికి ఇప్పటివరకు 56 మంది మరణించారు. గత 24 గంటల్లోనే కొత్తగా 336 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 2301 కొవిడ్​-19 కేసులు నమోదవగా.. 157 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2088 యాక్టివ్​ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గడిచిన రెండు రోజుల్లోనే దేశంలోని 14 రాష్ట్రాల్లో 647 కొత్త కరోనా కేసులు, 12 మరణాలు నమోదవగా.. వీరందరూ తబ్లీగీ జమాత్​తో సంబంధమున్నవారేనని అధికారులు తేల్చారు.

రాష్ట్రాల వారీగా..

తమిళనాడులో ఒక్కరోజే 102

తమిళనాడులో ఇవాళ ఒక్క రోజే 102 కొత్త కేసులు బయటపడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 411కి చేరింది. ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు కోలుకున్నారు.

దిల్లీ:

దిల్లీలో గడచిన 24 గంటల్లో 91 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 384కి పెరిగింది. నిజాముద్దీన్ ఘటనతోనే వైరస్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపారు.

రాజస్థాన్​:

రాజస్థాన్​లో ఇవాళ కొత్తగా 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 8 మంది మర్కజ్​కు హాజరైన వారే కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 154 మందికి వైరస్ సోకగా, ముగ్గురు చనిపోయారు. మరో 11 మంది కోలుకున్నారు.

ఉత్తర్​ప్రదేశ్:

ఉత్తర్​ప్రదేశ్​లో ఇవాళ కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 172కు చేరింది. ఇప్పటి వరకు ఇద్దరు కరోనాతో చనిపోగా.. మరో 17 మంది కోలుకున్నారు.

కర్ణాటక:

కర్ణాటకలో ఇవాళ కొత్తగా ఓ కేసు బయటపడిన నేపథ్యంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 125కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోగా.. 11 మంది మహమ్మారి దెబ్బ నుంచి కోలుకున్నారు.

మధ్యప్రదేశ్​:

మధ్యప్రదేశ్​లో ఇవాళ ఓ ఐఏఎస్​ అధికారి​ కరోనాబారినపడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 119 కేసులు నమోదవగా.. 8 మంది మృత్యువాతపడ్డారు.

గుజరాత్​:

గుజరాత్​లో కరోనాతో ఇవాళ ఒక వ్యక్తి మరణించాడు. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం కొవిడ్​-19 మృతుల సంఖ్య 8కి చేరింది. ఇవాళ ఇద్దరు మైనర్లు సహా 8 మందికి కరోనా పాజిటివ్​గా వచ్చింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 95కి చేరింది.

ఇదీ చూడండి: 'ఐకమత్య వెలుగులతో కరోనా చీకట్లపై పోరాటం'

Last Updated : Apr 3, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.