ETV Bharat / bharat

దేశంలో కరోనా రికార్డు.. 24 గంటల్లో 7466 కేసులు​ - corona cases raises india

భారత్​లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త‬ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో 175 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

india cases
భారత్​లో ఒక్కరోజులో 7466 కేసులు, 175 మరణాలు
author img

By

Published : May 29, 2020, 9:19 AM IST

Updated : May 29, 2020, 10:58 AM IST

భారత్​లో కొవిడ్-19​ మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,466 మందికి వైరస్ సోకింది. మరో 175 మంది వైరస్​కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కొవిడ్​-19 బాధితుల సంఖ్య లక్షా 66వేలకు చేరువైంది. కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్​ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. మరణాల్లో చైనాను దాటేసిన భారత్​.. పదమూడో స్థానానికి వెళ్లింది.

దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1982 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 59,546కి చేరింది. మొత్తం గుజరాత్​లో 15,562, మధ్యప్రదేశ్​లో 7,453 మంది వైరస్​ బారినపడ్డారు.

statistics
భారత్​లో కరోనా గణాంకాలు

ఇదీ చూడండి: దారుణం: కరోనా పోవాలని నరబలి!

Last Updated : May 29, 2020, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.