మహారాష్ట్రలో 694 మంది మృతి...
గడిచిన 24 గంటల్లోనే భారత్లో 103 కరోనా మరణాలు సంభవించాయి. మరో 3390 మందికి వైరస్ సోకింది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 56 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు వెల్లడించింది.
మహారాష్ట్రలో మృతుల సంఖ్య 694కు చేరింది. రాష్ట్రంలో 17 వేల 974 మంది కరోనా బారినపడ్డారు. మరో 3 వేల మందికిపైగా కోలుకున్నారు.
గుజరాత్లో ఇప్పటివరకు 425 మంది బలయ్యారు. మధ్యప్రదేశ్లో 193, రాజస్థాన్లో 97, దిల్లీలో 66 మంది మరణించారు.