దేశంలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. కొత్తగా 78,761 కరోనా కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి ధాటికి మరో 948 మంది బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 35 లక్షల మార్కు దాటింది.
మెరుగవుతున్న రికవరీ రేటు
పెరుగుతున్న పాజిటివ్ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.61 శాతానికి పెరిగింది. మరణాల రేటు కూడా మరింత ఊరటనిస్తూ 1.79 శాతానికి పడిపోయింది.
ఇదీ చదవండి: ఏడు రాష్ట్రాల్లోనే 81 శాతం కరోనా మరణాలు