దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గత 24 గంటల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,990 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 26,496కు పెరిగింది. మృతుల సంఖ్య 824కి చేరింది. 5,803 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 19,868గా ఉంది.
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 7,628కి చేరింది.