ETV Bharat / bharat

కొత్తిమీర రైతుకు.. గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు - ginnis book coriander height

ఉత్తరాఖండ్​లో లాక్​డౌన్​ వేళ టైంపాస్​ కోసం కొత్తిమీర పండించిన ఓ రైతుకు ప్రపంచ రికార్డులు దాసోహం అయిపోయాయి. తాజాగా గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డు సైతం అతడిని వెతుక్కుంటూ వచ్చేసింది.

coriander farmer from uttarakhand  got GUINNEES WORLD RECORD
ఆ కొత్తిమీర రైతుకు.. గిన్నీస్​ బుక్​లోనూ చోటుదక్కింది!
author img

By

Published : Jun 4, 2020, 7:56 PM IST

దాదాపు ఆరు అడుగుల పొడవుగల కొత్తిమీరను పండించి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించిన గోపాల్​ ఉప్రేతీ.. ఇప్పుడు గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లోనూ తన పేరును లిఖించాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చని నిరూపించాడు.

ఎలా సాధించాడు?

ఉత్తరాఖండ్​ అల్మోడాలోని విల్లేఖ్​ నివాసి గోపాల్ ఉప్రేతీ.. దిల్లీలో వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. లాక్​డౌన్ కారణంగా స్వగ్రామానికి వెళ్లిపోయాడు. తన యాపిల్​తోటలో ఖాళీ స్థలాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. కొత్తిమీర, వెల్లుల్లి, పాలకూర పంటలు వేశాడు.

సాధారణంగా కొత్తిమీర మొక్క ఒకటి, రెండు అడుగుల పొడవు ఉంటుంది. కానీ, ఉప్రేతీ వేసిన కొత్తిమీర పంట ఏకంగా ఆరు అడుగుల వరకు పెరిగింది. దీంతో ఈ అద్భుతాన్ని ప్రపంచానికి తెలిసేలా.. ప్రపంచ రికార్డులకు దరఖాస్తు చేద్దామని ఉప్రేతీ భార్య సలహా ఇచ్చింది. ఫలితంగా మే 7వ తేదీన లిమ్కా, ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, జూన్​ 4వ తేదీన గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డును కైవసం చేసుకున్నాడు ఉప్రేతీ.

ఇదీ చదవండి:కాపురాలపై కరోనా దెబ్బ.. రెండేళ్ల వరకు పిల్లల్ని కనొద్దట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.