బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమం కోసం పశ్చిమ మిద్నాపుర్ జిల్లాను సందర్శించారు. ఆ సమయంలో పోలీస్ ఐజీ రాజీవ్ మిశ్రా.. మమత కాళ్లు మెుక్కడం వివాదాస్పదమైంది.
8 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో బీచ్ పక్కన కుర్చీపై కూర్చున్న మమత.. అక్కడున్న వారికి కేకు తినిపించారు. ఈ క్రమంలో ఐజీ రాజీవ్ వంతు వచ్చింది. కేక్ తిన్న రాజీవ్ మమత పాదాలకు నమస్కరించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో కొద్ది క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ అధికారి ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కరించడమేంటని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటన ఆగస్టు 21న జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు బంగాల్ 'డైరక్టర్ ఆఫ్ సెక్యూరిటీస్' వినీత్ గోయల్ పుట్టినరోజు. ఆ వేడుకల్లో భాగంగానే మమతా బెనర్జీ అక్కడున్నవారికి కేక్ తినిపించారని సమాచారం.
ఇదీ చూడండి: గొప్ప ప్రదేశాల్లో ఐక్యతా విగ్రహానికి చోటుపై మోదీ హర్షం