ETV Bharat / bharat

కరోనా కట్టడికి కేంద్రం 'లోకల్​ స్కెచ్' - h1n1 similar to coorna

హెచ్‌1ఎన్‌1 వైరస్​ తరహాలో కొవిడ్‌ వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇలా వేగంగా వ్యాపించే వైరస్​ను ప్రాంతాలవారీగానే కట్టడి చేయాలని తెలిపింది. ఇక రాపిడ్‌’ పరీక్షలు రోగ నిర్ధారణ కోసం కాదని వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలుసుకోవడానికేనని భారత వైద్య పరిశోధన మండలి స్పష్టం చేసింది.

Containment ops to be scaled down if no secondary COVID-19 case for 4 weeks: Govt
మహమ్మారి కట్టడికి ప్రాంతాలవారీ చర్యలే మేలు
author img

By

Published : Apr 18, 2020, 9:17 AM IST

దేశంలో కొవిడ్‌-19 వ్యాప్తి.. 2009లో తలెత్తిన హెచ్‌1ఎన్‌1 వైరస్‌ తరహాలోనే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. నాటి మహమ్మారిలానే ప్రస్తుత కరోనా వైరస్‌ ప్రభావం దేశవ్యాప్తంగా ఒకేలా ఉండకపోవచ్చని పేర్కొంది. అందువల్ల ప్రాంతాలవారీగా నియంత్రణ విధానాన్ని అనుసరించాలని తెలిపింది. వైరస్‌ విజృంభణ ఎక్కువగా ఉన్న హాట్‌ స్పాట్‌లలో కఠిన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కొవిడ్‌-19 నియంత్రణకు సంబంధించి శుక్రవారం విడుదల చేసిన సవరించిన మార్గదర్శకాల్లో ఈ మేరకు అభిప్రాయపడింది. దీని ప్రకారం..

* భారత్‌లో కంటెయిన్‌మెంట్‌ చర్యలు చేపట్టే సమయంలో విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 1.క్లస్టర్లు ఎన్ని ఉన్నాయి, వాటి పరిమాణం ఎంత? 2. భౌగోళిక నిర్బంధాన్ని ఎంత సమర్థంగా అమలు చేస్తున్నారు? 3. భారతీయుల్లో ఈ వైరస్‌ ఎలా వ్యాపిస్తోంది? అందుకు ఉష్ణోగ్రత, తేమ లాంటి వాతావరణ పరిస్థితులు ఎంత మేర దోహదపడుతున్నాయి? 4. క్రియాశీల కేసుల గుర్తింపు, పెద్ద సంఖ్యలో పరీక్షలు చేపట్టడం, అనుమానితులను తక్షణం గుర్తించి, ఏకాంతంలో ఉంచడం, వారితో సంబంధం ఉన్నవారిని నిర్బంధంలో పెట్టడం వంటి చర్యల్లో ప్రజారోగ్యశాఖ స్పందన ఎలా ఉందన్నది చూడాలి.

* 2009లో హెచ్‌1ఎన్‌1 ఫ్లూ మహమ్మారి పెద్దనగరాల్లో విస్తృతంగా పాకింది. జనాభా కదలికలు భారీగా ఉండే చోట ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జనసాంద్రత తక్కువగా ఉండే గ్రామాలు, చిన్న పట్టణాలు; రహదారి, రైలు, విమాన సౌకర్యాలు సరిగా లేని ప్రాంతాల్లో చాలా తక్కువ కేసులు కనిపించాయి. ప్రస్తుత కొవిడ్‌-19 వ్యాప్తి తీరు తెన్నులు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. కొవిడ్‌-19 ఎక్కువ మందికి సోకి ఉండొచ్చు. కానీ దాని ప్రభావం దేశవ్యాప్తంగా ఒకేలా ఉండదు. అందువల్ల నియంత్రణ చర్యలు ప్రాంతానికో రకంగా చేపట్టాలి.

‘ర్యాపిడ్‌’ పరీక్షలు అందుకు కాదు...

ప్రాథమిక స్థాయిలో కరోనా వైరస్‌ను గుర్తించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న పీసీఆర్‌ ఆధారిత పరీక్షలు మాత్రమే చేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి బదులు ‘ర్యాపిడ్‌ యాంటీబాడీ పరీక్ష’లు చేయకూడదని రాష్ట్రాలకు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మార్గదర్శకాలు జారీచేశారు. వాటి ప్రకారం..

  • * నిర్దేశిత ప్రాంతంలో కొవిడ్‌-19 విస్తృతిని తెలుసుకోవడానికి ఉపయోగించే అదనపు సాధనమే ర్యాపిడ్‌ యాంటీబాడీ పరీక్ష. వ్యాధి లక్షణాలు కనిపించిన 7 రోజుల తర్వాతే ఈ పరీక్షను చేయాలి.
  • * ఆయా రాష్ట్రాల్లో హాట్‌స్పాట్‌లు లేకపోతే భవిష్యత్తులో హాట్‌స్పాట్‌లుగా మారేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ పరీక్షలు చేయాలి.
  • * ర్యాపిడ్‌ టెస్టులు ప్రారంభించే ముందు ఐసీఎంఆర్‌లో నమోదు చేసుకోవాలి.
  • * హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో జ్వరం, దగ్గు, జలుబులాంటి ఫ్లూ లక్షణాలు కనిపించినవారికి ఏడు రోజుల్లోపే ఆర్‌టీ పీసీఆర్‌ టెస్ట్‌ చేయాలి. అందులో పాజిటివ్‌ వస్తే వారికి వైరస్‌ సోకినట్లు లెక్క. నెగెటివ్‌ వస్తే అనుమానం ఉన్నట్లుగా పరిగణించాలి.
  • * అలాగే ఈ ప్రాంతంలో ఫ్లూ లక్షణాలున్నవారికి ఏడు రోజుల తర్వాతే ర్యాపిడ్‌ యాంటీ బాడీ టెస్టులు చేయాలి. ఇందులో పాజిటివ్‌ వస్తే కనీసం ఏడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాలి. ఒకవేళ నెగిటివ్‌ వచ్చినా కనీసం ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉంచాలి.

ఇదీ చదవండి:'మహా'నగరంలో కరోనా గుబులు మొదలైందా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.