దిల్లీలో విద్యుత్ వినియోగదారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 200 యూనిట్ల విద్యుత్ వరకు ఉచితంగా అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
201 యూనిట్ల నుంచి 401 యూనిట్ల వరకు సుమారు 50శాతం సబ్సిడీ అందించనున్నట్లు స్పష్టం చేశారు. 250 యూనిట్లకు ఇప్పటి వరకు 800 రూపాయలు చెల్లిస్తుండగా, ఇక నుంచి రూ. 252 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు.
300 యూనిట్ల విద్యుత్‌కు 971 రూపాయలకు గాను.. 526 రూపాయలు, నాలుగు వందల యూనిట్లకు 1320 రూపాయలకు గాను.. 1075 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. తగ్గించిన ధరలు గురువారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా దిల్లీ ప్రభుత్వంపై 1800 కోట్ల రూపాయల భారం పడనుంది.
ఇదీ చూడండి: బస్సులు, మెట్రోలో మహిళలకు ప్రయాణం ఉచితం!