ETV Bharat / bharat

చిదంబరం ఇంటి వద్ద సీబీఐ అధికారులు ఏం చేశారు? - సీనియర్ నేత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఐఎన్​ఎక్స్​-మీడియా కేసులో ఆయనకు దిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడం వల్ల సీబీఐ అధికారులు రెండు గంటల్లో తమ ముందు హాజరుకావాలని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. అరెస్ట్‌ను తప్పించుకునేందుకు చిదంబరం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

చిదంబరం ఇంటి వద్ద సీబీఐ అధికారులు ఏం చేశారు?
author img

By

Published : Aug 21, 2019, 6:53 AM IST

Updated : Sep 27, 2019, 5:50 PM IST

ఐఎన్​ఎక్స్​- మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఏక్షణమైనా చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు.. సీబీఐ సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐఎన్​ఎక్స్​ మీడియా కుంభకోణానికి సంబంధించి అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.

అనంతరం..ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం దిల్లీలోని చిదంబరం నివాసానికి వెళ్లింది. ఆ సమయంలో ఆయన తన నివాసంలో లేకపోవటం వల్ల వారు తిరిగి వెళ్లారు. తర్వాత ఉన్నతాధికారులతో చర్చించిన సీబీఐ అధికారులు మరోసారి చిదంబరం ఇంటికి వెళ్లి నోటీసులు అంటించారు.

సీబీఐ డిప్యూటీ ఎస్పీ ఆర్​ పార్థసారథి ముందు రెండు గంటల్లో హాజరు కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. చిదంబరం ఫోన్లు స్విఛ్చాఫ్ చేసి ఉన్నాయని సమాచారం. ఇంటికి అంటించిన నోటీసును ఆయన మెయిల్ ఐడీకి పంపినట్లు సమాచారం. ఈడీ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్​ నుంచి రక్షణ పొందేందుకు ఆయన సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్​ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. నోటీసులపై చిదంబరం తరఫు న్యాయవాది స్పందించారు. ఏ న్యాయసూత్రాల ప్రకారం తన క్లయింట్​ను 2 గంటల్లో హాజరు కావాలని ఆదేశించారో నోటీసుల్లో పేర్కొనలేదన్నారు. నేడు సుప్రీంలో చిదంబరం బెయిల్​ పిటిషన్​ విచారణకు రానుందని.. అంతవరకు ఆయనను అరెస్ట్​ చేయరాదని తెలిపారు.

ఇదీ చూడండి: ఐఎన్​ఎక్స్​ కేసు: చిదంబరంపై ఆరోపణలు ఏంటి?

చిదంబరం భవితవ్యంపై సుప్రీంలో నేడే విచారణ!

Nagaon (Assam), Aug 20 (ANI): Forest officials along with NGO activists rescued a 14.4-feet-long python in Assam's Nagaon district on Tuesday. The python weighing around 35 kilograms was found by the rescuers in one of the tea gardens and was later released in a nearby forest area. A wildlife activist involved in the rescue operation said "Today, along with the team of forest officials, we have rescued a python. The python was safely brought out of the tea garden. We later released it in a nearby forest area".
Last Updated : Sep 27, 2019, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.