మహిళలకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. భాజపా ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై ప్రత్యేక దర్యాప్తు చేయిస్తామని హరియాణా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారీ సెల్జా ప్రకటించారు.
'సంకల్ప్ పత్ర'లో ముఖ్యాంశాలు
- మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 33% రిజర్వేషన్. బస్సుల్లో ఉచిత ప్రయాణం.
- మహిళలకు పంచాయతీ రాజ్, మున్సిపల్ కార్పొరేషన్, మండలిలో 50% రిజర్వేషన్.
- రైతు రుణమాఫీ
- ఎస్సీ, వెనుక బడిన వర్గాల విద్యార్థులకు వార్షిక ఉపకారవేతనాలు. ఒకటి నుంచి పదో తరగతి చదివే బాలబాలికలకు 12 వేల రూపాయలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు 15 వేల రూపాయలు ఉపకార వేతనం.
ఇదీ చూడండి:'మహా'పోరు: కాంగ్రెస్కు 'దేశ్ముఖ్'లు దారి చూపుతారా?