కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ప్రత్యేక భద్రత ఉపసంహరణ, జేఎన్యూ విద్యార్థులపై లాఠీఛార్జ్ వ్యవహారంపై చర్చించాలని లోకసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి వెళ్లి పెద్దపెట్టున నినాదాలు చేశారు.
విపక్ష సభ్యుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సభాపతి ఓం బిర్లా. రేపటి నుంచి వెల్ లోకి వచ్చి ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విపక్షాలు ప్రస్తావించే అన్ని అంశాలపై సరైన మార్గంలో వస్తే చర్చించేందుకు సమయం ఇస్తానని స్పష్టంచేశారు ఓం బిర్లా.
అయినప్పటికీ... విపక్ష సభ్యులు శాంతించ లేదు.
ఇదీ చూడండి : ఇందిరా గాంధీకి మోదీ సహా ప్రముఖుల నివాళులు