ETV Bharat / bharat

'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై అఖిలపక్షం భేటీ - rahul

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది. జమిలి ఎన్నికలు సహా ఇతర కీలక అంశాలపై చర్చిస్తున్నారు. భేటీకి కాంగ్రెస్​, తృణమూల్​, డీఎంకే దూరంగా ఉన్నాయి.

'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై అఖిలపక్షం భేటీ
author img

By

Published : Jun 19, 2019, 3:14 PM IST

కేంద్ర ప్రభుత్వం కీలక అజెండాగా తీసుకున్న 5 అంశాలపై చర్చించేందుకు దిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. పలు పార్టీల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు.

జమిలి ఎన్నికలు, దేశ 75వ స్వాత్రంత్య వేడుకలు సహా పలు అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారు. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై ప్రధానంగా చర్చ సాగనుంది. లోక్​సభ సహా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై అన్ని పార్టీల అభిప్రాయాలను కోరనుంది కేంద్రం.

చర్చకు నిర్దేశించుకున్న అంశాలివే...

  1. పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించడం.
  2. ఒకే దేశం- ఒకే ఎన్నిక
  3. 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం
  4. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ.
  5. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి.

ఈ ఐదు అంశాలపై చర్చించేందుకు హాజరుకావాలని పార్టీ అధినేతలకు ఇటీవలే ఆహ్వానం పంపింది కేంద్రం.

వీళ్లు దూరం...

కేంద్రం నిర్వహిస్తున్న అఖిలపక్షం భేటీకి పలు పార్టీలు దూరంగా ఉన్నాయి. జమిలి ఎన్నికలపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్​ సమావేశానికి హాజరుకాలేదు. బంగాల్​ సీఎం, తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, డీఎంకే సారథి​ స్టాలిన్​ అఖిల పక్షం భేటీకి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు.

ఆమ్​ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్​ చద్దా, తెరాస నుంచి కేటీ రామారావు, తెదేపా నుంచి గల్లా జయదేవ్​ ఆయా పార్టీల ప్రతినిధులుగా హాజరయ్యారు.

AP Video Delivery Log - 0800 GMT News
Wednesday, 19 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0720: Japan Earthquake No access Japan 4216527
Aftermath of earthquake in northwestern Japan
AP-APTN-0705: Philippines Protest AP Clients Only 4216526
Anti-Duterte protest over fishermen held by China
AP-APTN-0700: US Sanders Trump Reax Must Credit Bernie Sanders 2020 presidential campaign 4216525
Sanders: Trump speech lies, distortions, nonsense
AP-APTN-0650: Hong Kong Legislative Council AP Clients Only 4216524
Legislative Council resume session after protests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.