ETV Bharat / bharat

'మార్కెట్లను పెంచి రైతులను కాపాడండి ' - priyanka gandhi on airports lease

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రైతులు మార్కెట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్​ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Cong targets govt over farm laws, airport lease
' మార్కెట్లను పెంచి రైతులను కాపాడండి '
author img

By

Published : Nov 2, 2020, 9:10 PM IST

పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉన్నట్లు బిహార్​లోనూ అధిక సంఖ్యలో మండీలు ఉండాలని బిహార్​ రైతులు డిమాండ్​ చేస్తున్నారని కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ తెలిపారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులను నష్టాల్లోకి నెట్టివేస్తాయని కాంగ్రెస్​ నాయకుడు జైరాం రమేష్​ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్​ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా సైతం కేంద్రం లక్ష్యంగా ట్విట్టర్​లో విమర్శలు గుప్పించారు. ప్రజలకు దీపావళి కానుకగా ఆర్థిక మాంద్యం ఇచ్చి.. బడా వ్యాపారస్థులకు ఆరు విమానాశ్రయాలను ఇచ్చారని తెలిపారు. లఖ్​నవూ విమానాశ్రయాన్ని ప్రైవేట్​ వ్యక్తులకు అప్పజెప్పటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.