ETV Bharat / bharat

'2 కోట్ల మంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి వద్దకు వెళ్తాం' - దేశవ్యాప్త నిరసనలు

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై విపక్షాలు, రైతుల సంఘాలు నిరసనలకు సిద్ధమయ్యాయి. అన్ని రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు, ఆందోళనలతో భారీ ప్రజోద్యమానికి పిలుపునిచ్చింది కాంగ్రెస్. బిల్లులకు వ్యతిరేకంగా రెండు కోట్ల మంది రైతుల సంతకాలను సేకరించి రాష్ట్రపతికి వినతి పత్రాన్ని సమర్పించాలని కాంగ్రెస్​ నిర్ణయం తీసుకుంది.

Cong
కాంగ్రెస్
author img

By

Published : Sep 22, 2020, 5:06 AM IST

వివాదాలకు దారి తీసిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇవి రైతు వ్యతిరేక చట్టాలని ఆరోపించింది. అన్ని రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది.

దిల్లీలో జరిగిన పార్టీ ప్రధానకార్యదర్శులు, రాష్ట్ర ఇన్​ఛార్జుల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్​ గాంధీ సూచనలకు అనుగుణంగా ఈ భేటీ నిర్వహించారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు ఈ విషయంపై మాట్లాడారు.

గవర్నర్లకు వినతి పత్రం..

వచ్చే 3 రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా తెలిపారు. సెప్టెంబర్​ 28న ర్యాలీగా వెళ్లి గవర్నర్లకు వినతి పత్రం అందజేస్తామని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామన్నారు.

"రైతుల గళాన్ని వినిపించేందుకు అక్టోబర్ 10న కిసాన్ సమ్మేళన్​ నిర్వహిస్తాం. అక్టోబర్​ 2-31 వరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది రైతుల సంతకాలను సేకరిస్తాం. ఈ సంతకాలతో వినతి పత్రాన్ని నవంబర్​ 14న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు అందజేస్తాం."

- రణ్​దీప్ సుర్జేవాలా

రాష్ట్రపతికి వినతి..

వ్యవసాయ బిల్లులపై శిరోమణి అకాలీదళ్ నేతలు రాష్ట్రపతిని కలిశారు. బిల్లులకు ఆమోదం తెలుపొద్దని విజ్ఞప్తి చేశారు. బిల్లులను వెనక్కి పంపి సవరణలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పార్టీ నేత సుఖ్​బీర్​ సింగ్ బాదల్ తెలిపారు. ఈ బిల్లులతో 20 లక్షల మంది రైతులు, 15 లక్షల మంది కూలీలపై ప్రభావం పడుతుందన్నారు.

రాస్తారోకో..

వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదం నేపథ్యంలో దేశవ్యాప్త నిరసనలకు భారతీయ కిసాన్ సమాఖ్య పిలుపునిచ్చింది. సెప్టెంబర్​ 25న రాస్తారోకో నిర్వహిస్తామని ప్రకటించింది.

పంజాబ్​, హరియాణాలో సెప్టెంబర్​ 25న బంద్​కు పిలుపునిచ్చింది రైతు సంఘం అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఏఐకేఎస్​సీసీ). ఇతర రాష్ట్రాల్లోనూ ఆందోళనలు చేస్తామని స్పష్టం చేసింది. బిల్లులకు ఆమోదం తెలపకూడదని రాష్ట్రపతిని కలిసి కోరనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.