ETV Bharat / bharat

'ఇది శివసేనకు వెన్నుపోటు.. భాజపాతో కలవడం ద్రోహం' - Ajit Pawar has back-stabbed Shiv Sena: Raut

మహారాష్ట్రలో భాజపాతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి... శివసేనను అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అనూహ్య పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్​ సింఘ్వి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీల మధ్య చర్చలు సుదీర్ఘంగా జరిగాయని... దీంతో వచ్చిన అవకాశాన్ని కొందరు వేగంగా అందుకున్నారని వ్యాఖ్యానించారు.

'ఇది శివసేనకు వెన్నుపోటు.. భాజపాతో కలవడం ద్రోహం'
author img

By

Published : Nov 23, 2019, 11:34 AM IST

Updated : Nov 23, 2019, 12:04 PM IST

ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాతో చేతులు కలిపి ఎన్​సీపీ నేత అజిత్ పవార్ శివసేనకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్. అజిత్​ పవార్​ చేసిన పనిని మహారాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు.

"శివసేనను అజిత్ పవార్ వెన్నపోటు పొడిచారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భాజపాతో చేతులు కలపడం ద్రోహం. అజిత్​ పవార్​ నిర్ణయానికి ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ ఆమోదం తెలపలేదు."-సంజయ్ రౌత్

ఎన్​సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రేలతో ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు సంజయ్.

దుర్వినియోగం చేశారు...

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజిత్​ పవార్​పై ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేల హాజరుకోసం తీసుకున్న సంతకాలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ఆశ్చర్యం...

మహారాష్ట్రలో భాజపా, ఎన్​సీపీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్​ సింఘ్వీ స్పందించారు. ఈ అనూహ్య ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన కాంగ్రెస్, శివసేన, ఎన్​సీపీల మధ్య చర్చలు సుదీర్ఘంగా జరిగాయని వ్యాఖ్యనించారు. దీంతో వచ్చిన అవకాశాన్ని కొందరు వేగంగా అందుకున్నారని అన్నారు.

  • Surreal wht I read abt #Maharashtra. Thought it was fake news. Candidly &personally speaking, our tripartite negotiations shd not have gone on for more than 3 days...took too long. Window given was grabbed by fast movers. #pawarji tussi grt ho! Amazing if true, still not sure

    — Abhishek Singhvi (@DrAMSinghvi) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నిజంగా చెప్తున్నా...మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంపై వచ్చిన వార్తలు అసత్యమని ముందుగా భావించాను. మా మధ్య చర్చలు మూడు రోజుల కన్నా ఎక్కువ జరగాల్సింది కాదు. చాలా ఆలస్యమైంది. వేగంగా స్పందించి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. పవార్​జీ మీరు చాలా గ్రేట్​"-సింఘ్వి ట్వీట్​

Nagaur (Rajasthan), Nov 23 (ANI): At least 11 people died after two mini buses they were travelling in lost balance and met with an accident. The incident took place in Kuchaman city of Rajasthan's Nagaur at around 3 am on November 23. Injured have been admitted to hospital.
Last Updated : Nov 23, 2019, 12:04 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.