ETV Bharat / bharat

నన్ను మాట్లాడనివ్వలేదు: స్పీకర్​కు​ రాహుల్​ లేఖ

పార్లమెంటరీ కమిటీ సమావేశంలో తను మాట్లాడేందుకు అనుమతించలేదని ఆరోపిస్తూ లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాకు లేఖ రాశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. పార్లమెంటరీ ప్యానల్​ భేటీల్లో ఎంపీలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కుకు భరోసా కల్పించాలని కోరారు.

Rahul gandhi
కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ
author img

By

Published : Dec 17, 2020, 5:29 PM IST

Updated : Dec 17, 2020, 5:52 PM IST

పార్లమెంటరీ కమిటీ సమావేశంపై లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాకు లేఖ రాశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ప్యానల్​ భేటీలో తనను మాట్లాడేందుకు అనుమతించలేదని ఆరోపించారు. ఈ అంశంలో కలుగజేసుకోవాలని, పార్లమెంటరీ ప్యానెల్​ సమావేశాల్లో ఎంపీలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కుకు భరోసా కల్పించాలని కోరారు.

పార్లమెంటు సంరక్షకుడిగా స్పీకర్.. రక్షణ రంగంపై ఏర్పాటైన ప్యానెల్‌లో చర్చలు దాని పాత్ర, లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూడాలన్నారు రాహుల్​. 'కమిటీ చర్చలు పక్కదారి పట్టినప్పుడు ప్రశ్నించే హక్కు సభ్యునికి ఉంటుంది. నేను చెప్పినదానితో విభేదించేందుకు కమిటీ సిద్ధంగా ఉంది. కానీ, ఛైర్మన్​ ఒక సభ్యుడిని మాట్లాడటానికి కూడా అనుమతించకపోవడం.. ప్రభుత్వం సైనిక వ్యవహారాలను ఎలా నిర్వహిస్తుందనే దానిని సూచిస్తోంది. ఇది విచారకరం' అని పేర్కొన్నారు రాహుల్​.

రక్షణ రంగ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంట్​ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించగా.. భేటీ మధ్యలోనే వాకౌట్​ చేశారు రాహుల్​ గాంధీ, పలువురు కాంగ్రెస్​ నేతలు. కీలక అంశాలు పక్కన పెట్టి జవాన్ల యూనిఫాంపై చర్చలు జరుపుతూ కమిటీ సమయాన్ని వృథా చేస్తోందని ఆరోపించారు.

గౌరవించటం నేర్చుకోండి..

పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి రాహుల్​ గాంధీ వాకౌట్​ చేయటంపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ఇది పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగ సంస్థలను అవమానించటమేనన్నారు. ముందు రాజ్యాంగ సంస్థలను గౌరవించటం నేర్చుకోవాలని రాహుల్​ గాంధీకి హితవు పలికారు. గత ఏడాదిన్నర కాలంలో 14 సమావేశాలు జరిగితే.. రాహుల్​ కేవలం రెండింటికే హాజరయ్యారని గుర్తు చేశారు. ఏడాదిలో అనుసరించాల్సిన అజెండా నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా రాలేదన్నారు. రాజ్యాంగ విధానాలను ఆయన ఎంతమాత్రం గౌరవం ఇస్తున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పార్లమెంట్ కమిటీ భేటీ నుంచి రాహుల్​ వాకౌట్​

Last Updated : Dec 17, 2020, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.