బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సమన్వయం, ప్రచారం సహా వివిధ అంశాలపై కమిటీలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్. వీటిలో కీలకమైన ఎన్నికల నిర్వహణ, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలాను నియమించింది అధిష్ఠానం.
14 మంది సభ్యులుగా గల ఈ కమిటీకి కన్వీనర్‌గా పార్టీ ప్రతినిధుల్లో ఒకరైన మోహన్ ప్రకాశ్‌ను నియమించింది కాంగ్రెస్. మీరా కుమార్, తారిఖ్ అన్వర్, శత్రుఘ్న సిన్హా, కీర్తి ఆజాద్, షకీల్ అహ్మద్, సంజయ్ నిరుపమ్ వంటి పార్టీ సీనియర్ నాయకులకు ఇందులో చోటు దక్కింది.
ప్రచార కమిటీ, మీడియా సమన్వయ కమిటీ, పబ్లిక్ మీటింగ్స్ అండ్ లాజిస్టిక్స్ కమిటీ సహా పలు ప్యానెల్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.
కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి తరఫున బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేయనుంది.
ఇదీ చూడండి: బిహార్ బరి: 'రాబిన్ హుడ్' ప్రభావమెంత ?