ETV Bharat / bharat

వెంటిలేటర్​పైనే ప్రణబ్: ఆర్మీ ఆస్పత్రి ప్రకటన

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ముఖ్యమైన పారామితులు స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వెంటిలేటర్​పైనే ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​కు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

condition of Honble Shri Pranab Mukherjee remains unchanged this
ప్రణబ్​ ఆరోగ్య పరిస్థితిపై బులిటన్ విడుదల
author img

By

Published : Aug 24, 2020, 12:20 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. ఈ మేరకు సోమవారం దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రణబ్​ ముఖ్యమైన పారామితులు స్థిరంగా ఉన్నాయని.. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. అప్పటికే ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈనెల 10న ఆపరేషన్​ నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.