ETV Bharat / bharat

సీఎస్​, డీజీపీలు దిల్లీ వెళ్లరు: బంగాల్​ సర్కార్​ - హోం శాఖ సమన్లపై బంగాల్ ప్రభుత్వం స్పందన

Bengal decision not to send CS and DGPs before Home Ministry
హోం శాఖ సమన్లపై బంగాల్ ప్రభుత్వం స్పందన
author img

By

Published : Dec 11, 2020, 6:50 PM IST

17:49 December 11

సమన్లపై హోం శాఖకు బంగాల్ లేఖ

బంగాల్ ప్రధాన కార్యదర్శి(సీఎస్), డీజీపీలను కేంద్ర హోం శాఖ ముందుకు పంపొద్దని నిర్ణయించింది మమత సర్కార్. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా కాన్వాయ్​పై రాళ్లదాడి విషయంలో వివరణ ఇచ్చేందుకు ఈ నెల 14న తమ ముందు హాజరు కావాలని హోం శాఖ సమన్లు పంపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది బంగాల్ ప్రభుత్వం.

జేపీనడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి అంశంలో ఇప్పటికే 3 కేసులు నమోదు చేశామని.. ఏడుగురిని అరెస్టు చేశామని బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు. నడ్డా పర్యటించే మార్గంలో నలుగురు అడిషనల్‌ ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 14 మంది ఇన్‌స్పెక్టర్లు, 70 మంది ఎస్ఐలు, 40 మంది ఆర్​ఐఎఫ్​ సిబ్బంది, 259 మంది కానిస్టేబుళ్లు, 350 మంది సహాయక దళాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని లేఖలో వివరించారు. 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.