మహారాష్ట్రలోని నాగ్‌పుర్-ముంబయి రహదారిపై అకోలా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో 6 నెలల పసికందు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారును ట్రక్కు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు.
మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముర్తిజపుర్ తాలుకా వద్ద కారును ట్రక్కు ఢీకొన్నట్టు పోలీసులు వెల్లడించారు. కారులో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్పష్టం చేశారు. వారిని అకోలా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
"నాగ్‌పుర్ నుంచి ముంబయి వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు చాలా బలంగా ఢీకొనడం వల్ల కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులోని బరావుద్దీన్ దిలావర్(35), ఫాతెమా దిలావర్(50), అస్లీం సహా ఆరు నెలల బుర్హానుద్దీన్ ఘటనాస్థలిలోనే మరణించారు."
-పోలీసులు.